ఏపీ, ఒడిస్సా సరిహద్దులోని 21 వివాదాస్పద గ్రామాలపై సుప్రీం కోర్టు కీలక వాఖ్

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న 21 గ్రామాలపై వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీ చెప్పిన ప్రకారం తాము నడుచుకుంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 07:00 AM IST

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న 21 గ్రామాలపై వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీ చెప్పిన ప్రకారం తాము నడుచుకుంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదం పరిష్కారం కోసం చాలా రోజుల నుండి రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి నవంబర్ 9న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి ఈ వివాదాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న పలు గ్రామాలపై రెండు రాష్ట్రాలు పంతానికి పోయాయి. ఆ గ్రామాలు తమ గ్రామాలంటూ ఒడిశా పెత్తనం చలాయించగా, ఏపీ కూడా ఆ గ్రామాలన్నీ తమవేనంటూ అక్కడ తమ ఓటర్లు ఉన్నారని అప్పట్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామాల్ పైచేయి సాధించడం కోసం అధికారిక కార్యక్రామాలు కూడా నిర్వహించాయి.

అయితే అక్కడి ప్రజల్లో మాత్రం ఏ రాష్ట్రానికి చెందాలనే విషయంపై కొంత మిశ్రమ అభిప్రాయాలున్నాయి. ఇక కమిటీ ఏం తేలుస్తుంది, ఆ గ్రామాల ప్రజల భవితవ్యం ఏం కానుందనే విషయం తేలాల్సి ఉంది.