TDP : “న్యాయానికి సంకెళ్లు”.. చేతులకు తాళ్లు కట్టుకుని నారా భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మ‌ణి నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ (#NyayanikiSankelluForCBN) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో చేతుల‌కు తాళ్లు క‌ట్టుకుని నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణిలు నిర‌స‌న తెలిపారు. న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.

Also Read:  Congress List Issue: కాంగ్రెస్ అసమ్మతి సెగ… కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం

  Last Updated: 15 Oct 2023, 08:23 PM IST