Site icon HashtagU Telugu

Suicide : ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ అధ్య‌క్షుడు ఆత్మ‌హ‌త్య‌.. త‌న చావుకు కార‌ణం ఆ ముగ్గురేనంటూ సెల్ఫీ వీడియో

Deaths

Deaths

ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన అజ్మీరా ప్ర‌సాద్ నాయక్ విజ‌య‌వాడ‌లోని ఓప్ర‌వేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన చావుకు అదే గ్రామానికి చెందిన తిరుపతి భూలక్ష్మి, భూక్యా తిరుపా, ఎ. కొండూరు ఎస్సై రాజులపాటి అంకారావు కారణమని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపాడు. అజ్మీరా ప్ర‌సాద్ నాయ‌క్ స్వ‌గ్రామం ఏ.కొండూరు మండ‌లం గోపాల‌పురం. ప్ర‌సాద్ నాయ‌క్ మృతితో ఎ. కొండూరు పోలీసు స్టేషన్ వద్ద గిరిజనుల ఆందోళన చేప‌ట్టారుజ ఎ. కొండూరు పోలీసు స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్త‌త నెల‌కొంది. అజ్మీరా ప్రసాద్ నాయక్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని గిరిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి భూలక్ష్మి, భూక్యా తిరుపా, ఎ. కొండూరు ఎస్సై రాజులపాటి అంకారావు తనను మానసికంగా హింసించడం వల్లే తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో అజ్మీరా ప్ర‌సాద్ నాయ‌క్ కన్నీటి పర్యంతమైయ్యారు. త‌న బాధను అర్థం చేసుకుని.. ఇటువంటి కార్యక్రమాలు మళ్లీ జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో అజ్మీరా ప్ర‌సాద్ నాయ‌క్ కోరాడు.

Also Read:  Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ఎంతో తెలుసుకోండి..!