Site icon HashtagU Telugu

NTR : ఏపీలో కూటమి విజయం పై జూ. ఎన్టీఆర్ రియాక్షన్..

Ntr Tweet Nda

Ntr Tweet Nda

ఏపీలో కూటమి (AP NDA alliance) ఘన విజయం సాధించడం పై జూ. ఎన్టీఆర్ (NTR) స్పందించి టీడీపీ శ్రేణుల్లో ఆనందం నింపారు. గత కొంతకాలంగా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తరుణంలోనే కాదు ఎన్నికల సమయంలో కూడా చిన్న కామెంట్ కూడా చేయకపోయేసరికి టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది నేతలు నేరుగా ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో నేడు కూటమి విజయం సాధించడం పై ఎన్టీఆర్ స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి , షాక్ కు గురి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ తన ట్విట్టర్లో.. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

చిత్రసీమ నుండి కూడా కూటమి విజయం పై విశేష స్పందన వస్తుంది. హీరోలు , డైరెక్టర్స్ , నిర్మాతలు , నటి నటులు ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక నిన్న చిరంజీవి కూటమి విజయం ఫిక్స్ అని తెలియగానే ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

Read Also : AP Secretariat : కీలక ఫైల్స్ మిస్ కావొచ్చు అనే అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీస్ బందోబస్తు