NTR Statue: నందమూరి తారక రామారావు.. యావత్ తెలుగుజాతి గర్వించే మహానేత. ఆయనను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు చాలా ఇష్టపడతారు. భౌతికంగా ఎన్‌టీఆర్ ఈ లోకంలో లేనప్పటికీ.. ఆయన ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఎన్‌టీఆర్ నటించిన ఆణిముత్యాల లాంటి సినిమాలను నేటికీ తెలుగు ప్రజానీకం కళ్లారా చూస్తున్నారు. దేవుడి పాత్రల్లో ఎన్‌టీఆర్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. యుగ పురుషుడిలా నిలిచిన ఎన్‌టీఆర్ తెలుగు జాతి కీర్తిని యావత్ దేశంలో చాటిచెప్పారు. తెలుగువాళ్లుగా మనమంతా గర్వించేలా చేశారు. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసే దిశగా ఏపీలోని కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే అన్న ఎన్‌టీఆర్ అత్యంత భారీ విగ్రహాన్ని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
Also Read :Sathya Sai Centenary: పుట్టపర్తి సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం
ఏడీఆర్ తయారీకి సన్నాహాలు
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అచ్చం అదే తరహాలో ప్రజల మనిషి ఎన్‌టీఆర్ భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలోని రాజధాని ప్రధాన ప్రాంతంలో ఉన్న నీరుకొండలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ విగ్రహం నిర్మాణానికి సంబంధించిన వివరాలతో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను తయారు చేసేందుకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్లు వేయొచ్చు. డీపీఆర్‌ను తయారు చేసి సమర్పించొచ్చు. నీరుకొండలో నిర్మించనున్న ఎన్‌టీఆర్ భారీ విగ్రహం మోడల్ ఎలా ఉంటుందనే దానిపై కొన్ని ఊహాచిత్రాలను ఇప్పటికే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విడుదల చేసింది.
Also Read :Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !
క్రికెట్ స్టేడియం కూడా..
గుజరాత్‌లో నర్మదా నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఉంది. దాన్నే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఈ విగ్రహం సమీపంలో.. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను నిర్మించారు. అమరావతిలోనూ అదే తరహాలో ఎన్‌టీఆర్ భారీ విగ్రహం, క్రికెట్ స్టేడియం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అమరావతిలో సీఎం అధికారిక నివాసం, ఇతర కీలక ప్రభుత్వ భవనాలను కలుపుతూ 6 కిలోమీటర్ల పొడవైన రోడ్డు రాబోతుంది. 6 కిలోమీటర్ల పొడవైన కోర్ క్యాపిటల్ ఎండింగ్ పాయింట్‌గా నీరుకొండ ఉంది. దానిపైనే ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. అమరావతికి ముఖ్యమైన అట్రాక్షన్ గా ఎన్టీఆర్ విగ్రహం ఉండబోతోంది. ఇటీవలే ఏపీ మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని చూసి వచ్చారు. తద్వారా ఎన్‌టీఆర్ విగ్రహం రూపకల్పనపై క్లారిటీకి వచ్చారు.