స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టయి 20 రోజులు కావొస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం చేసారు. జూ.ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ తప్ప. కొంతమంది సినీ ప్రముఖులు నేరుగా స్పందించకపోయినప్పటికీ ..లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కాకపోతే ఈ విషయం బయటకు చెప్పడం లేదు. వేరేవారి సంగతి అటుంచితే..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ స్పందించకపోవడం ఫై అంత విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ స్పందించకపోవడం వెనుక టీడీపీ నేతలే కారణం అన్నట్లు తెలుస్తుంది.
నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్.. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసిందంటూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శించారు. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సమయంలోను ఎన్టీఆర్ స్పందిస్తే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేసిన విషయాన్నీ ఎన్టీఆర్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.
‘ఎన్టీఆర్ (NTR), వైఎస్‌ఆర్ (YSR) ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించలేదని పలువురు టీడీపీ అభిమానులు తప్పుపట్టారు.
ఇలా ఎన్టీఆర్ స్పందించనప్పుడల్లా టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. స్పందిస్తే ఒకలా..స్పందించకపోతే మరోలా విమర్శలు చేయడం టీడీపీ నేతల తీరు అని..అందుకే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారని..సమయం వచ్చినప్పుడు అన్ని చెపుతారని..ఎవర్ని ఎక్కడ తొక్కలో కూడా ఎన్టీఆర్ కు తెలుసనీ..ఎన్టీఆర్ అభిమానులు చెపుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చెపుతున్న దాంట్లో నిజం ఉంది కదా..ఎన్టీఆర్ అప్పుడు స్పందిస్తే అలాగే విమర్శలు చేసారు కదా..అందుకే సైలెంట్ గా ఉన్నాడు కావొచ్చని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also: AP : నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లను కూడా అరెస్ట్ చేస్తారా..?