NTR: బెజ‌వాడ‌లో ‘ఎన్టీఆర్’ పాలిట్రిక్స్‌.. విగ్ర‌హానికి ‘వైసీపీ’ పాలాభిషేకం!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని జిల్లాలో వివాదం చోటుచేసుకుంటుంటే, మ‌రికొన్ని జిల్లాలో రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. కృష్ణాజిల్లాని రెండు జిల్లాలుగా విభ‌జించ‌డంతో విజ‌య‌వాడ కేంద్రంగా

  • Written By:
  • Updated On - January 28, 2022 / 12:02 AM IST

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని జిల్లాలో వివాదం చోటుచేసుకుంటుంటే, మ‌రికొన్ని జిల్లాలో రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. కృష్ణాజిల్లాని రెండు జిల్లాలుగా విభ‌జించ‌డంతో విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణాజిల్లాగా పేరు పెడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ లో పేర్కోంది. అయితే దీనిపై రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మ‌రుతోంది. విజ‌య‌వాడ కేంద్రంగా కొత్త జిల్లాకి కాపు నేత వంగ‌వీటి మోహ‌న రంగా పేరు పెట్టాల‌ని ఓ వ‌ర్గం డిమాండ్ చేస్తుంది. మ‌రో వ‌ర్గం మాత్రం ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తుంది. తాజాగా ప‌ట‌మ‌ట ఎన్టీఆర్ స‌ర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ జెండాల‌తో పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు.

వైసీపీ జెండాల సాక్షిగా ఎన్టీఆర్ కి పాలాభిషేకం చేసి ఆయ‌న‌కు నివాళ్లు అర్పించారు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు పాద‌యాత్ర‌లో కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇవ్వ‌డం అది ఇప్పుడు నేర‌వేర్చార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. దీంతో ఇక్క‌డి రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మ‌రింది. జిల్లాలో క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంతో వైసీపీకి క‌లిసి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచారని.. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినందుకు సీఎం జగన్ కి దేవినేని అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆ పదవిని దొంగలాగా చంద్రబాబు దోచుకున్నాడని.. ఎన్టీఆర్ పేరు కనుమరుగు అయ్యే విధంగా చంద్రబాబు ఇంతకాలం ప్రవర్తించార‌ని అవినాష్ ఆరోపించారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టి చారిత్రాత్మక నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని.. టీడీపీ నేతలు దీనిపై ఆనందం వ్యక్తం చేయకపోవడం చాలా బాధగా ఉందన్నారు. దేవినేని నెహ్రూ కి ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ ఇస్తే వైస్సార్ పునర్జన్మ ఇచ్చారని అవినాష్ తెలిపారు.