Site icon HashtagU Telugu

AP : లోకేష్ మద్దతుగా మంగళగిరిలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రచారం

Ntr Family Mangalagiri

Ntr Family Mangalagiri

ఏపీలో ఎన్నికలకు (AP Elections) మరో నాల్గు రోజుల సమయం మాత్రమే ఉండడం తో తమ అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యులు , శ్రేయోభిలాషులు ప్రచారం చేస్తున్నారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలుపు కోసం మెగా ఫ్యామిలీ తో పాటు చిత్రసీమ కు చెందిన పలువురు నటి నటులు , నిర్మాతలు , హీరోలు ప్రచారం చేస్తుండగా..ఇటు మంగళగిరి లో లోకేష్ (Nara LOkesh) గెలుపు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు (NTR Family ) ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది లోకేశ్​కు మద్దతుగా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. లోకేష్​ గెలిస్తేనే మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

గత ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసిన లోకేష్ ఓటమి చెందారు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా అక్కడే పర్యటిస్తూ..ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తూ వచ్చారు. గత ఎన్నికల సమయానికి ఇప్పటికి ప్రజల్లో లోకేష్ ఫై నమ్మకం పెరిగింది. ఈసారి లోకేష్ ను గెలిపించుకుంటాం అని చెపుతూ వస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ కి ఎదురుగాలి వీస్తోంది. వైసీపీ నుంచి బరిలో దిగిన మురుగుడు లావణ్యకు ఆ పార్టీ మాజీ ఇంఛార్జి గంజి చిరంజీవి సహాయ నిరాకరణ పెద్ద మైనస్​గా మారింది. దీనికితోడు ఐదేళ్ల వైసీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు సంక్షేమం ముందుడుగు పడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నా కూటమి విజయం తప్పనిసరనే అభిప్రాయంలో ఉన్నారు. ఒక్క ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈసారి కూటమికే మద్దతు పలుకుతున్నారు.

Read Also : Venu Swamy: మళ్లీ పవన్‌పై బాంబ్ పేల్చిన వేణుస్వామి