Site icon HashtagU Telugu

TANA : తానా ఇత‌ర దేశాల్లో అందుబాటులోకి ఎన్‌టీఆర్‌ స్మారక నాణెం

TANA NTR

TANA NTR

తానా ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టీఆర్‌ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా ఒక ఒప్పందం జరిగిందని ఎన్ .టి .ఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు టి .డి జనార్దన్ తెలిపారు. సోమవారం రోజు హైద్రాబాద్ లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌, హైదరాబాద్ మింట్‌ సీజీఎం వి.ననరసింహ నాయుడు, జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునీడి శ్రీనివాస్‌తో జనార్దన్ సమావేశం ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని విడుదల చేసిన ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం ఇప్పటికే 25వేలకు పైగా అమ్ముడయ్యాయి. అయితే అమెరికాతో సహా పలు దేశాలలోని ఎన్‌టిఆర్‌ అభిమానులు తమకు కూడా స్మారక నాణెం కావాలని కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటయ్యిందని ఆయన చెప్పారు. అమెరికాలోని వివిధ నగరాలలో ఉన్న తెలుగువారు ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం కావాలని కోరుతున్నారని, వారందరికీ నాణెం సులభంగా లభించడానికి మింట్ అధికారులతో సమావేశమయ్యామని తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌ తెలిపారు. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ స్మారక నాణెన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి indiagovtmint.in వెబ్ సైట్ ఏర్పాటయ్యిందని మింట్‌ సీజీఎం నరసింహ నాయుడు చెప్పారు. దీని ద్వారా బుక్‌ చేసుకున్న వారికి ఇంటికి పంపిస్తామని తెలిపారు. ఎన్‌టీఆర్‌ స్మారక నాణేనికి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తానా వారి సహకారంతో విదేశాలలో వున్నా వారికి కూడా ఈ నాణెంను పంపించడం జరుగుతుంది మింట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునేడుశ్రీనివాస్‌ అన్నారు.

Also Read:  India Squad: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్..!