Site icon HashtagU Telugu

Nara Rohit : ఇప్పుడు విప్లవం ఒక హక్కు : నారా రోహిత్

Nara Rohit

Now Revolution Is A Right Nara Rohit

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై హీరో నారా రోహిత్ (Nara Rohit) ఘాటుగా స్పందించారు. “నియంత పాలన వాస్తవం అయినప్పుడు.. విప్లవం ఒక హక్కు అవుతుంది” అని విక్టర్ హ్యూగో ఇచ్చిన సూక్తితో ఆయన ఒక ట్వీట్ చేశారు.

“చంద్రబాబు అరెస్టు ద్వారా జగన్ సర్కారు చేసిన చర్యకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. అయితే సమయం రావాలి”అని నారా రోహిత్ (Nara Rohit) కామెంట్ చేశారు.

కాగా, శనివారం తెల్లారుజామున చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం 6:25 గంటలకు టీడీపీ చీఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే ఏపీవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఈ అంశంపై స్పందించారు.

Also Read:  Arogya Mahila: తెలంగాణ మహిళల కోసం ‘ఆరోగ్య మహిళా’, రాష్ట్రంలో మరో 100 సెంటర్లు