గత వారం రోజులుగా ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలను శాంతి తో పాటు విజయసాయి ఇప్పటికే ఖండించినప్పటికీ..మదన్ మాత్రం విజయసాయి ని DNA టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు దేవాదాయ శాఖ శాంతికి నోటీసులు జారీ చేసింది. ఏపీ దేవాదాయశాఖలో 2020 లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్‌మోహన్ అని శాంతి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయించారని, గత ఏడాది జనవరి 25వ తేదీన డెలివరీ సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారని దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన మీడియా సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారని, విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని మొదటి అభియోగం మోపారు.
అలాగే ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు. కమిషనర్ అనుమతి లేకుండా మీడియా సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు. ఇలా పలు అభియోగాలు మోపుతూ వాటికీ సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసారు. మరి వీటికి శాంతి ఎలాంటి సమాదానాలు ఇస్తుందో చూడాలి.
Read Also : AP Assembly Sessions : జగన్ తో రఘురామ చెప్పిన మాటలు ఇవే..
