Site icon HashtagU Telugu

Non-Bailable Cases: చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు: బాబు లాయర్లు

Non-Bailable Cases

High Tension In Nandyala

Non-Bailable Cases: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ పై బాబు లాయర్లు స్పందించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని లాయర్ రామచంద్రరావు మీడియాతో అన్నారు. బీపీ ఎక్కువగా ఉందని, డయాబెటిస్ ఉందని చెప్పారు. వైద్యపరీక్షల తరువాత సీఐడీ అదుపులోకి తీసుకోబోతున్నారని ఆయన తెలిపారు. స్కిల్ డెవల్మెంట్ కేసు కింద చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. 52 సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 166, 167,418, 420 కింద కేసులు పెట్టారు. సెక్షన్లు 465,468, 479, 409,201లు ఆయన మీద పెట్టారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు (Non-Bailable Cases) కూడా ఉన్నాయని రామచంద్రరావు అన్నారు.

మరోపక్క చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని టీడీపీ శ్రేణులు చూస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఎక్కడిక్కడే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతారణం నెలకొంది. చంద్రబాబు సీఎంగా 2015లో స్కిల్ డెలవప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం జరిగింది. రూ.3,356 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయంలో రూ.371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు రాగా.. 2020 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 FEBలో ACB విచారించగా.. డిసెంబర్ లో కేసు CIDకి బదిలీ అయ్యింది. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు ఉన్నట్లు CID పేర్కొంది.

Also Read: Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్..  అదే కేసులో..!

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు‌ను కూడా అరెస్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావుతో పాటు  ఆయన  కొడుకును అదుపులోకి తీసుకున్నట్టు  తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన  కొడుకును  కూడా పోలీసులు అరెస్ట్  చేసినట్టుగా సమాచారం అందుతోంది. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న టైంలో  గంటా శ్రీనివాసరావు  సంబంధిత శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారని, అందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఏపీ సీఐడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.