ఏపీలో కూటమి (AP NDA Govt) అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ (YCP) నేతలపై , శ్రేణులపై దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇళ్లలోకి వెళ్లి మరి దాడులు చేస్తున్నారు. అలాగే పలు ఆస్తులను సైతం ధ్వంసం చేస్తూ వస్తున్నారు. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున పిర్యాదులు చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల కూటమి శ్రేణులు తగ్గడం లేదు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం (Pawan Kalyan ) ఈ దాడులపై మరోసారి స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ తమకు శత్రువు కాదని, ప్రత్యర్థి మాత్రమేనని..ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరారు. ‘వైసీపీ నేతలను కక్షపూరితంగా వేధించొద్దు. సోషల్ మీడియాలో నిందించకూడదు. వ్యక్తిగత దూషణలు చేయొద్దు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని మనం చేతులు కట్టుకుని ఉండొద్దు. వాళ్లు తప్పులు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష పడుతుంది’ అని పేర్కొన్నారు. గతంలో పిఠాపురం లో ఏర్పాటు చేసిన సక్సెస్ సభ లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే పవన్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల తర్వాత దాడులు తగ్గుతాయని అనుకున్నారు కానీ అలాగే కొనసాగుతుండడం తో మరోసారి పవన్ విన్నవించుకోక తప్పలేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన దీక్ష ను విరమించారు. గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో తన దీక్ష ముగిసింది. ఇక సోమవారం మంగళగరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీని ఆయన సత్కరించారు. తర్వాత వాళ్లందరూ కలిసి పవన్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : Pawan Kalyan : నేను ప్రధాని మోడీ హృదయంలో ఉన్నాను: పవన్ కల్యాణ్