Site icon HashtagU Telugu

No rule of law : అమ్మో ఏపీ..! రూల్ ఆఫ్ లా గాలికి.!

No Rule Of Law

No Rule Of Law

ఏపీ లా అండ్ ఆర్డ‌ర్ (No rule of law ) గురించి హైకోర్టు జ‌డ్జి రాకేశ్ మూడేళ్ల క్రిత‌మే చెప్పారు. రూల్ ఆఫ్ లా ఏపీలో ఎక్క‌డ లేద‌ని తేల్చేశారు. తాజాగా ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల కిడ్నాప్ నిరూపించింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీ స‌త్య‌నారాయ‌ణ ఏపీలో వ్యాపారం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. అంటే, ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఏపీని కాద‌ని తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఎంపీ స్థాయి వ్య‌క్తికి కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏమిటి? అనేది చెప్ప‌న‌వ‌స‌రంలేదు.

రూల్ ఆఫ్ లా ఏపీలో ఎక్క‌డ లేద‌ని తేల్చేశారు (No rule of law)

ఎప్పుడు ఎవర్ని పోలీసులు తీసుకెళ‌తారో తెలియ‌దు. ఎందుకు తీసుకెళ‌తారో కూడా అంత‌బ‌ట్ట‌దు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను చాలా మందిని పోలీసులు విచార‌ణ‌కు తీసుకెళ్లారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన వాళ్ల‌ను, రీ పోస్ట్ చేసిన రంగ‌నాయ‌క‌మ్మ‌లాంటి వ‌య‌స్సు మీద ప‌డిన వాళ్ల‌ను కూడా వ‌ద‌ల్లేదు. హైకోర్టు తీర్పుల మీద విచ్చ‌ల‌విడిగా అధికారంలోని వైసీపీ క్యాడ‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా బూతుపురాణం వినిపించింది. త‌న వాళ్ల‌కు ఒక న్యాయం ఇత‌రుల‌కు మ‌రో న్యాయం అన్న‌ట్టు ఏపీ పోలీసుల్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంట్ టీమ్ వాడేస్తోంది. అందుకే, ప‌ద‌వీవిర‌మ‌ణ‌కు ముందే ఏపీ లా అండ్ ఆర్డ‌ర్ (No rule of law) గురించి హైకోర్టు జ‌డ్జి రాకేశ్ త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

నిద్ర‌పోతోన్న వాళ్ల మీద పెట్రోలు పోసి త‌గుల‌బెట్టిన సంఘ‌ట‌న

ఎప్ప‌డూ చూడ‌ని, విన‌న‌న్ని ర‌కాల నేరాలకు కేంద్ర బిందువుగా ఏపీ మారింది. అందుకే, మ‌రో నార్త్ కొరియా, శ్రీలంక అంటూ ఏపీని పోల్చుతున్నారు. ఒక‌ప్పుడు బీహార్, యూపీ రాష్ట్రాల్లోని నేరాల గురించి భార‌త ప్ర‌జ‌లు చెప్పుకునే వాళ్లు. ఇప్పుడే ఏపీలోని నేరాలు, ఘోరాల‌ను చెప్పుకోవ‌డం ఆ రాష్ట్ర ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. సోద‌రిని వేధిస్తున్నార‌ని ప్ర‌శ్నించినందుకు పదో తరగతి చదివే అమర్ నాథ్ అనే బాలుడిని సజీవ దహనం చేసిన ఘ‌ట‌న క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. నిద్ర‌పోతోన్న వాళ్ల మీద పెట్రోలు పోసి త‌గుల‌బెట్టిన సంఘ‌ట‌న రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపేలా చేస్తోంది. య‌థా రాజ త‌థా ప్ర‌జ అంటారు పెద్ద‌లు. రాజు ఎలా ఉంటే ప్ర‌జ‌లు కూడా అలాగే మ‌స‌లుకుంటార‌ని దాని అర్థం. అధికారంలోని పెద్ద‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో, ఆ త‌ర‌హాలో ప్ర‌జ‌లు కూడా న‌డుచుకుంటున్న‌ట్టు తాజా దృష్టాంతాలు క‌నిపిస్తున్నాయి.

హ‌త్య‌ల‌కు కేరాఫ్ గా ఏపీ

కత్తిపోట్లు, హత్యలు, సజీవదహనాలు, మానభంగాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. హింసనే ఆయుధంగా వైసీపీ చేసుకుంద‌ని విప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌. గుండాలు, రౌడీలు, హంత‌కులు పాల‌కులుగా ఉంటే సుప‌రిపాల‌న క‌ష్ట‌మ‌ని వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ చెబుతున్నారు. అందుకు త‌గిన విధంగా రాష్ట్రంలోని పరిస్థితులు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పోలీసు వ్య‌వ‌స్థ‌కు స్వ‌చ్ఛ‌లేకుండా చేశారు. డ్రైవ‌ర్ ను చంపేసి ఇంటికి తీసుకొచ్చి ప‌డేసిన వైసీపీ ఎమ్మెల్సీని చూశాం. మాన‌భంగాలు చేసిన వాళ్ల వెనుక వైసీపీ లీడ‌ర్ల అండ‌ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇక హ‌త్య‌ల‌కు కేరాఫ్ గా ఏపీ మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన క్యాడ‌ర్ మీద జ‌రిగిన హ‌త్య‌లు బ‌హుశా గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఎప్పుడూ (No rule of law) జ‌రిగి ఉండ‌వు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ లీడ‌ర్ల గురించి దురుసుగా మాట్లాడుతున్నార‌ని ఆ పార్టీ ఇచ్చే వివ‌ర‌ణ‌.

Also Read : Jagan manifesto : ఫోన్‌, టీవీ రీచార్జి ఫ్రీ మేనిఫెస్టో? జ‌గ‌న్ కు రిల‌యెన్స్ స‌హ‌కారం!

పులివెందుల త‌ర‌హా రూలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. అక్క‌డ స్వేచ్ఛ‌గా ఓట్లు వేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని క‌డ‌ప వాసులు చెబుతుంటారు. మ‌రో 30 ఏళ్లు సీఎంగా ఉంటాన‌ని చెబుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఊరుకో రౌడీ, గుండాను పెట్టార‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం న‌డుస్తుంద‌ని ఆందోళ‌న చెందారు. రాబోవు రోజుల్లో వైసీపీ గూండాలు, రౌడీల‌కు భ‌య‌ప‌డి బ‌త‌కాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ద‌ళితుల మీద దాడులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు. భూ క‌బ్జాలు, డ్ర‌గ్స్, గంజాయి..ఇలా ప‌లు ర‌కాల నేరాల‌కు కేంద్రంగా ఏపీ మారిందని ప్ర‌తిప‌క్షం చెబుతోంది. ఫ‌లితంగా రూల్ ఆఫ్ లా (No rule of law) లేకుండా పోయిందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌