Site icon HashtagU Telugu

AP Politics: ప్రత్యేక హోదా కోసం జగన్.. అధికారం కోసం కూటమి

Ap Politics

Ap Politics

AP Politics: ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికనేది తెలియాలంటే మెజారిటీపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకూడదని నేను కోరుకుంటున్నాను అని జగన్ చెప్పడం వెనుక ప్రత్యేక హోదా అనే హాస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు తెలుస్తుంది. అలా అని జగన్ బీజేపీకి దూరం అయ్యాడని కాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోతే తన ఎంపీ సీట్ల ద్వారా ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి వీలుంటుందని జగన్ భావిస్తున్నారు.

రెండు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ మరియు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలి అంటే టీడీపీ ఇతర పార్టీల పొత్తుతోనే సాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నంగా న్యూఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా, బీజేపీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక బిజెపి నాయకత్వం పొత్తుల నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేసింది. కాగా ఈ మూడు పార్టీలు గతంలోనూ కూటమిగా ఏర్పడి పని చేశాయి. అప్పటి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో పొత్తుల వ్యవహారంపై మూడు పార్టీల అగ్రనేతలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చాలా కాలంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న బీజేపీ ఈ వారంలో టీడీపీతో చేతులు కలపడంపై తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది.

Also Read: MLC Kavitha: తక్షణమే కులగణనను ప్రారంభించాలి, బీసీలకే రూ. 20 వేల కోట్లు కేటాయించాలి