తనకు నరకం చూపించిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టనంటూ హెచ్చరించారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చంద్రబాబు ను ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలియంది కాదు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేయించి..దాదాపు 53 రోజులు జైల్లో పెట్టింది. కనీసం బెయిల్ కూడా రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. జైల్లో ను చంద్రబాబు ను అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేసి రాక్షస ఆనందం పొందారు. తన వయసును , తన రాజకీయ అనుభవం, తనకున్న గుర్తింపు ఇలా ఏది కూడా పట్టించుకోకుండా కనీసం జైల్లో దోమలు కూడుతున్నాయి..దోమల తెర ఇవ్వండి..వేడినీళ్లు ఇవ్వండన్నా కానీ ఇవ్వకుండా చేసారు. ఇవే విషయాలు తాజాగా మరోసారి చంద్రబాబు గుర్తు చేసారు.
బుధవారం సాయంత్రం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను జైలులో ఉన్నప్పుడు తనను చంపడానికి కుట్ర చేసారని , జైలుపై డ్రోన్లు ఎగురవేసి, జైలు గదిలో సీసీ కెమెరా పెట్టి తన ప్రతి కదలికను గమనించారని తెలిపారు. జైలులో ఉన్నప్పుడు అంత నరకం అనుభవించిన తాను.. బయటికొచ్చాక కక్ష తీర్చుకోవాలి.. కానీ తనది అలాంటి స్వభావం కాదన్నారు . గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. ఆ బాధలన్నీ తనకు తెలుసన్నారు. తప్పుచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా తమ ప్రయత్నం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
Read Also : Negative Thoughts : నెగెటివ్ థాట్స్ మీకు సహాయం చేయవు.. ఈ 5 సాధారణ చిట్కాలను అనుసరించండి..!