Site icon HashtagU Telugu

AP : రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు – చంద్రబాబు

Chandrababu (2)

Chandrababu (2)

రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేసారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికలకు (Ap Elections) మరో వారంలో శుభం కార్డు పడబోతోంది. మే 13 న అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఈరోజు రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తో పాటు మూడు పార్టీల నేతలు , శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో ప్రధాని మోడీ, అమిత్ షా తెలిపారు. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని జోస్యం తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జగన్ పనైపోయిందని సెటైర్లు వేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్‌ అని , ఏపీ అభివృద్ధికి మోడీ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని చెప్పుకొచ్చారు. ‘‘జగ్గూ భాయ్‌ నీ బాబాయ్‌ (మాజీ మంత్రి వివేకానందారెడ్డిని) ఎవరు చంపారో.. ఇంకా అర్థం కాలేదా’’ అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

ఇక నారా లోకేష్ మాట్లాడుతూ..”దేశానికి మోడీ గారి అవసరం ఎంతో ఉందన్నారు. నాలుగు అక్షరాలు దేశం దశ దిశ మార్చాయి. అది నమో నమో నమో (NaMo). తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మోడీ. మోడీ భారతదేశానికి గర్వకారణం… మోడీ నవభారత నిర్మాత” అంటూ ప్రశంసలు కురిపించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రధాని మోడీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు నడుస్తుంటే, ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు ఘడియలు నడుస్తున్నాయన్నారు. ఏపీలో ఎటు చూసినా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు… ఇవన్నీ ఆగాలంటే మోడీ ముందుండి ఏపీని నడిపిస్తే తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్లలేం. అందుకే ఆయన ఆశీస్సులు కోరుకున్నాం ” అని చెప్పుకొచ్చారు.

Read Also : Rythu Bandhu : మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. రైతు బంధు నిధులు విడుదల