Site icon HashtagU Telugu

AP Politics: ఇద్ద‌రూ నేల‌విడిచి సాము! గ్రాఫ్ గ‌డ‌బిడ!

Ap

Ap

`ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌ప‌డితే వ‌చ్చే గెలుపు సాధార‌ణం. ప్ర‌త్య‌ర్థి కంటే బ‌లప‌డి త‌ల‌ప‌డడం ద్వారా వ‌చ్చే విజ‌యం అసాధార‌ణం. ` ఈ సూత్రాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్వ‌యిస్తే 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూడొచ్చు. కానీ, ప్ర‌స్తుతం టీడీపీ బ‌ల‌ప‌డి త‌ల‌ప‌డ‌డం మానేసింది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త మీద ఆధార‌ప‌డుతోంది. అందుకే, జ‌గ‌న్ గ్రాఫ్ ఎంత త‌గ్గిపోయిన‌ప్ప‌టికీ టీడీపీ గ్రాప్ అమాంతం పెరిగిన దాఖలాలు లేవు.

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు రాజ‌నీతిజ్ఞుడు. ఆయ‌న ఎత్తుగ‌డ‌లు ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేసేలా ఉంటాయి. కానీ, ఆయ‌న వ్యూహాల‌కు అనుగుణంగా ఎల్లో సైన్యం దూకుడుగా వెళ్ల‌లేక‌పోతోంది. ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల మీద పోరాడేందుకు బోలెడ‌న్ని ఇష్యూలు ఏపీలో ఉన్నాయి. కానీ, గ్లామ‌రస్ ఇష్యూల‌ను మాత్ర‌మే టీడీపీ టేక‌ప్ చేస్తోంది. ఆ మేర‌కు అధిష్టానం ఇస్తోన్న పిలుపుకు క్షేత్ర‌స్థాయి స్పంద‌న అంతంత మాత్రంగా ఉంటోంది. అనుకూల మీడియా హడావుడి మిన‌హా పార్టీ సొంత బ‌లాన్ని కూడ‌దీసుకునే దిశ‌గా వెళ్ల‌లేక‌పోతుంది. అందుకే, అమాంతం పెరగాల్సిన గ్రాఫ్ య‌థాలాపంగా ఉంద‌ని స‌ర్వే సంస్థ‌లు ఇస్తోన్న సారాంశం.

Also Read:   Kodali Nani: సిగ్గుందా.. బాలకృష్ణ? తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలా..?

మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆ పార్టీ విధానాలు కూడా చాలా మంది జనాలకు నచ్చడంలేదు. ఏపీలో అభివృద్ధి లేదు అంటున్న జ‌నం సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. త‌ట‌స్థ ఓట‌ర్లు వైసీపీ అంటే బటన్ నొక్కే పార్టీగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యతిరేకత టీడీపీకి అనుకూలించాలి. కానీ, చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతోన్న ప్ర‌జా ఉద్య‌మం వ‌చ్చేంత‌ సీరియ‌స్ గా అనుకూల‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ గ్రాఫ్ ఎంత త‌గ్గుతున్న‌ప్ప‌టికీ టీడీపీ గ్రాఫ్ మాత్రం పెద్ద‌గా పెరగడంలేదనే వాస్త‌వాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించార‌ట‌. ఈ వ్యతిరేకత ఎటు పోతోంద‌నే దానిపై అధ్య‌య‌నం చేస్తున్నారు. ఏపీలో చూస్తే జ‌గ‌న్ ఏలుబడిలో డెవలప్మెంట్ లేద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కనీసం వీధి దీపం కూడా వేయించే స్తోమత సర్పంచులకు లేకుండా పోయింది. ఖజానా నుంచి వచ్చే డబ్బు, అప్పుల ద్వారా పుట్టే సొమ్ము బ‌ట‌న్ నొక్కుడుకే స‌రిపోతోంది. సంక్షేమం ఒక్కటి చాలు డెవలప్మెంట్ అవసరం లేదు అన్నట్లుగా జ‌గ‌న్ పాల‌న ఉంద‌ని సొంత పార్టీలోని వాళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Also Read:    Kodali Nani: సిగ్గుందా.. బాలకృష్ణ? తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలా..?

వైసీపీ క్యాడర్ ని కూడా హై కమాండ్ పెద్ద‌గా పట్టించుకోవడంలేదు. మూడున్నరేళ్ళ నుంచి క్యాడ‌ర్, జ‌గ‌న్ మ‌ధ్య అంత‌రం పెరిగింది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ తో నాయకుల వ‌ద్ద‌కు కార్య‌క‌ర్త‌లు రావాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఫ‌లితంగా క్యాడ‌ర్, లీడ‌ర్ల‌కు మ‌ధ్య దూరం పెరిగింది. సోషల్ మీడియా కేంద్రంగా కూడా మ‌నుప‌టి మాదిరిగా వైసీపీ క్యాడర్ ఉత్సాహంగా క‌నిపించ‌డంలేదు. సోషల్ మీడియా ను ఒక బురద గుంటగా ఆ పార్టీ హై కమాండ్ భావిస్తోంది. అందుకే క్యాడర్ ని పెద్దగా సోష‌ల్ మీడియా వైపు ఫోకస్ పెట్టేలా ప్ర‌త్యేక చర్యలు తీసుకోవడంలేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ తీరు చూస్తే వైసీపీ వంద తప్పులు చేస్తే మచ్చుకు కొన్ని అన్నట్లుగా(చీప్ ఇష్యూలు) తీసుకుని వాటినే హైలెట్ చేస్తోంది. సామాజిక స‌మ‌స్య‌ల‌పై పోరాటం అంతంత మాత్రంగానే ఉంది.

అనుకూల మీడియాలోని కొంద‌రి ఓవ‌రాక్ష‌న్ టీడీపీ గ్రాఫ్ ను ప‌డేలా చేస్తుంద‌ని ఆ పార్టీ అగ్ర‌నేత‌లు గ్ర‌హించార‌ట‌. సొంత పార్టీ వాళ్లు కూడా ఏవ‌గించుకునేంత అతి చేస్తూ అనుకూల మీడియా ముసుగులో కొంద‌రు పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ మీడియా చేసే రాద్ధాంతం సూపర్ సక్సెస్ అవుతోంది. దీంతో వాపును చూసి బ‌లుపు అనుకుంటూ రాజ్యాధికారం క‌ల‌ల్ని క‌న‌డం పార్టీకి చేటు. టీడీపీ అనుకూల మీడియా ఓవ‌రాక్ష‌న్ కు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు రావ‌డంలేదు. వాళ్లను చాలా లైట్ గా తీసుకుంటోంద‌ని వినికిడి. ఫ‌లితంగా అనుకూల మీడియా చేసే అతిని ఎక్కువ‌గా ఊహించుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్స్ ను టీడీపీ మ‌ర‌చిపోతుంద‌న్న అపవాదు ఉంది. స‌రిగ్గా ఇలాంటి త‌ప్పు 2019 ఎన్నిక‌లప్పుడు టీడీపీ చేసింది.

Also Read:    Andhra Pradesh : వ్య‌వ‌సాయ మోట‌ర్లకు మీట‌ర్లు బిగిస్తున్న ఏపీ స‌ర్కార్‌.. 16 ల‌క్ష‌ల మంది రైతులు..?

జనాలు టీవీ చానళ్ళను, ప్రింట్ మీడియాను కూడా పార్టీలుగా విభజించి చూస్తున్నారు. ఆ కల్చర్ ఏపీలో ప్రారంభ‌మై చాలా కాలం అయింది. జస్ట్ టైమ్ పాస్ గా మీడియా అతిని చూస్తారు మిన‌హా వాటిని బుర్రల్లోకి ఎక్కించుకోరు. అందుకే, క్షేత్ర‌స్థాయి రిపోర్టుల‌ను న‌మ్ముకోవాల‌ని టీడీపీలోని కొంద‌రు తొలి నుంచి చెబుతున్నారు. వైసీపీ కూడా అతి ధీమా గా ఉంది. జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు కచ్చితంగా అధికార పార్టీకి దెబ్బ ప‌డుతుంది. దాన్ని ఒడుపుగా పట్టుకున్న విపక్షానికి అనూహ్య విజ‌యం ల‌భిస్తుంది.

సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌నం చల్లగా ఉన్నారని వైసీపీ భావించవచ్చు. ల‌బ్దిదారుల‌ను ఓటు బ్యాంక్ గా అంచనా వేసుకోవచ్చు. స‌రిగ్గా ఇలాంటి అంచ‌నా 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు వేశారు. ప్ర‌జ‌లు 80శాతం త‌న‌వైపు ఉన్నార‌ని భావించారు. `నేను వేసిన రోడ్లు, నేను ఇచ్చిన నీళ్లు, నేను ఇచ్చే కానుక‌లు..తీసుకుని వేరే వాళ్లకు ఓట్లు ఎలా వేస్తారు`అంటూ 2019 ఎన్నిక‌ల‌ప్పుడు చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. అనుకూల మీడియా కూడా ఆనాడు ఆయ‌న్ను ముసుగులో పెట్టింది. సీన్ క‌ట్ చేస్తే, 23 మంది ఎమ్మెల్యేల‌కు ప‌రిమితం అయింది. అందుకే క్షేత్ర‌స్థాయి రిపోర్ట్స్ ను న‌మ్ముకుంటే అధికార , విప‌క్షాల‌కు మంచిది. త‌ద్భిన్నంగా అటు బాబు ఇటు జగ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ నేల‌విడిచి సాము చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.