Site icon HashtagU Telugu

Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు సీటుపై సస్పెన్స్..?

Caste politcs

Ganta Srinivasa Rao

ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) పోటీ చేసే సీటుపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. అమరావతిలో టీడీపీ చీఫ్‌ నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu)తో గంటా శ్రీనివాసరావు భేటీ ముగిసింది. తాను పోటీ చేసే సీటుపై చంద్రబాబుతో గంటసేపు చర్చించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత గంటా శ్రీనివాస రావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబుతో భేటీ అనంతరం గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు.. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని గంటా శ్రీనివాస రావు వెల్లడించారు.. కానీ.. అయితే తాను భీమిలి లేదా విశాఖపట్నం జిల్లా నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు చెప్పినట్లు గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది తనకే వదిలేయాలని చంద్రబాబు చెప్పారని గంటా స్పష్టం చేశారు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబు నాతో అన్నారని గంటా వివరించారు.

అంతేకాకుండా.. గత కొన్ని రోజులుగా చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. మీరు అక్కడ పోటీ చేస్తే బాగుంటుందన్నారని, ఒక్కసారి ఆలోచించండని నా అభిప్రాయం చెప్పానని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోనే ఉండాలనుకుంటున్నాని చెప్పడంతో.. భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసిందని, ఆ విషయం నాకే వదిలేయాలని చంద్రబాబు అన్నారు. చీపురుపల్లా? భీమిలా? మీకు ఏది మంచిదో చూసి నిర్ణయం తీసుకుంటాను అని చంద్రబాబు అన్నట్లు గంగా శ్రీనివాస రావు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో మళ్లీ కలుద్దామని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు.
Read Also : Dil Raju : బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిర్మాత దిల్‌రాజు..?