Site icon HashtagU Telugu

MLC Anantha Babu : ‘అనంత’ క్రైమ్ థ్రిల్ల‌ర్ `క‌థ`!

Mlc Ananthababu Issue

Mlc Ananthababu Issue

వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా జ్యోతుల నెహ్రూ మేనల్లుడు. ఆయ‌న‌ది కాపు సామాజిక వర్గం. తండ్రి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తే. రాజకీయ నాయకుడు అయిన తండ్రి కూడా స్త్రీ లోలుడు కావడంతో అప్పట్లో నక్సలైట్లు కాల్చి చంపేశారని వినికిడి. తండ్రి వారసత్వంతో మన్యంలో రాజకీయాలను నడుపుతున్న అనంతబాబు 2014 లో కొండకాపు అనే కుల ధృవీకరణ పత్రం తీసుకొని వైసిపి తరపున నామినేషన్ దాఖలు చేశాడు. ప్రత్యర్థుల అభ్యంతరంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆనాడు తనకు డమ్మీ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేసింది. రాజకీయ నేపథ్యం, ఆర్థిక బలం ఉండడంతో ST నియోజకవర్గం అయిన రంపచోడవరం లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు. అప్పుడే రంగురాళ్ల వ్యాపారం చేసి కోట్లు గడించాడ‌ని స్థానికులు చెప్పుకుంటారు. ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తూ మామతో పాటు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజ‌కీయ పరిస్థితుల్లో జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరారు. అనంతబాబు మాత్రం వైసీపీలోనే కొనసాగాడు. 2014 ఎన్నికలలో తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో డమ్మీ అభ్యర్థి రాజేశ్వరికి మద్దతు తెలిపి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ కార‌ణంగా ఆమెను కొంత‌కాలంపాటు అనంతబాబు తన సహజపద్దతిలో ఇబ్బంది పెట్టార‌ని తెలుస్తోంది. అంతేకాదు, వేధింపులు భరించలేని రాజేశ్వరి ఆనాడు అధికారంలో ఉన్న‌ టీడీపీ తీర్థం పుచ్చుకుని రక్షణ పొందింద‌ని ఆ ప్రాంతంలోని టాక్‌. 2019 ఎన్నికలలో ధనలక్ష్మి అనే మరో టీచర్ ని నిలబెట్టి గెలిపించాడు. ఆమె ద్వారా రాజ‌కీయాన్ని న‌డిపాడు. నియోజకవర్గంలో పార్టీ సభలు, సమావేశాలలో మహిళలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందమైన మహిళలకి మరింత ప్రాధాన్యత ఉంటుందని ఆయ‌న స‌హ‌చ‌రులు చెప్పుకునే మాట‌లు. 2019 లో వైసిపి ప్రభుత్వం వచ్చాక డీసీసీబీ చైర్మన్ గా నియమింపబడిన అనంతబాబు స్వయంగా మేనత్త అయిన జ్యోతుల నెహ్రూ భార్యపై 3 కోట్ల నగదు కుంభకోణం కేసు నమోదు చేయించి విచారణ జరిపించాడు. ఆ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య వైరం పెరిగింది.

అనంతబాబు HIV పేషెంట్ అని కూడా సొంత నియోక‌వ‌ర్గంలో ప్ర‌చారం ఉంది. త‌న‌ భార్యతో గత 4 సంవత్సరాలుగా దాంప‌త్య జీవితం ప‌ట్ల అన్యోన్యంగా లేడ‌ని తెలుస్తో్ంది. ఆ క్రమంలో అనంతబాబు కదలికలపై నిఘాపెట్టిన భార్య డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించింది. అతని ప్రతి కదలికను ఆమెకు డ్రైవ‌ర్ చేరవేస్తున్నాడని పోలీసుల ప్రాథమిక విచార‌ణ‌లోని సారాంశం. అనంతబాబుకి ఉన్న వ్య‌క్తిగ‌త సంబంధాల వీడియోలు, ఫోటోల రూపంలో అతని భార్యకి డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం చేర‌వేశార‌ట‌. కొన్ని సన్నివేశాలను వీడియోల రూపంలోనూ ఆమెకు ఇచ్చాడని స‌మాచారం. ఆ విషయాలను ఆమె తన సోదరులు, తండ్రికి తెలియజేసిందట‌. ఒక రోజు వాళ్ళు అనంతబాబు మీద తీవ్రంగా దాడి చేశారని కూడా ప్రచారంలో ఉంది. అయినా అతని తీరుమారలేదు. ఆయ‌న భార్య డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంతో సాన్నిహిత్యంగా ఉంటూ స‌మాచారాన్ని సేక‌రించ‌డం వివాదానికి కార‌ణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, డ్రైవ‌ర్ తో క‌లిసి మ‌ట్టుపెట్ట‌డానికి సుబ్ర‌మ‌ణ్యంతో క‌లిసి ఆమె స్కెచ్ వేసింద‌ని అనంత‌బాబు అనుమానం. త‌న‌ను చంప‌డానికి 15 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నార‌ని ఆయ‌న అనుమానించాడ‌ని స‌న్నిహితుల చెప్పుకునే మాట‌లు. మరికొన్ని రోజుల్లో ఆ పథకం అమలు కావాల్సి ఉంది. ఇంతలో విషయం అనంతబాబుకి తెలిసి సుబ్రహ్మణ్యన్ని మట్టుబెట్టాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో ఆయ‌న అరెస్ట్ కావ‌డంతో పాటు జైలు జీవితాన్ని గ‌డుపుతున్నాడు.

అయితే, ఈ కేసు నుండి అతనిని తప్పించడానికి ఇప్పుడు పోలీసులు పడుతున్న పాట్లు ప‌డుతున్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు త‌ర‌చూ చేస్తోన్న ఆరోప‌ణ‌లు. అందుకు త‌గిన విధంగా అనంత‌బాబును అరెస్ట్ చేయ‌డానికి నాలుగు రోజుల టైం తీసుకున్నారు. ఈ కేసులోని నిజానిజాల్ని పోలీసులు ఎప్పుడు పూర్తిస్థాయిలో బ‌య‌పెడ‌తారో చూద్దాం!