Jagananna Vidya Deevena : జగనన్న `విదేశీ విద్యా దీవెన` గ‌గ‌నం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకొచ్చిన `విదేశీ విద్యా దీవెన` ప‌థ‌కాన్ని అందుకోవ‌డం చాలా క‌ష్టం.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 04:14 PM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన `విదేశీ విద్యా దీవెన` ప‌థ‌కాన్ని అందుకోవ‌డం చాలా క‌ష్టం. ఆ ప‌థ‌కాన్ని పొందాలంటే పెట్టిన అర్హ‌త ను సాధించాలంటే సాధార‌ణ విద్యార్థులకు అసాధ్యం. ఎందుకంటే, ఆ ప‌థ‌కాన్ని పొంద‌డానికి అర్హ‌త‌క‌లిగిన‌ ఆ 200 యూనివర్శిటీల లిస్టు పరిశీలిస్తే అస‌లు నిజం తెలుస్తోంది.

ఆ 200 యూనివర్శిటీల్లో అడుగున వున్న అమెరికన్ యూనివర్శిటీ Vanderbilt. అమెరికాలో పుట్టి పెరిగి అక్క‌డ చదువుకున్న పిల్లలకే అందులో సీటు రావడం క‌ష్టం. ఇక ఏపీలో ఎంతమంది ఎస్సీ , ఎస్టీ పిల్లలకు అందులో సీటు వస్తుందో మీరే అర్థం చేసుకోండి. అందులో సీటు వచ్చినా ఆ యూనివ‌ర్సిటీ 196వ లిస్ట్ లో ఉంది కాబట్టి జగనన్న దీవెన కింద 50 శాతం ఫీజు వ‌స్తుంది. మిగతా 50శాతం కట్టుగోగల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంత మంది ఉంటారో జ‌గ‌న్‌కు తెలియ‌న అంశం కాదు.

జ‌గ‌న్ చెప్పిన 200 యూనివ‌ర్సిటీల పట్టికలోని చిట్టచివరి Vanderbilt యూనివర్శీటీ ఉదాహరణ‌గా తీసుకుంటే ఏడాదికి ట్యూషన్ ఫీజు 50వేల డాలర్ల పైమాటే. అంటే, ఇంచుమించు 44 లక్షలు. ఆ యూనివ‌ర్సిటీ రెండో సగం లిస్టులో ఉంది క‌నుక‌ ప్రభుత్వం ఇచ్చేది అందులో సగమే. అంటే 24లక్షల రూపాయ‌లు. ఈ పథకం ఎవరికయ్యా అంటే ఏడాదికి 8 లక్షల ఆదాయం దాటని వారికి. అంటే ఏడాదికి 8 లక్షల ఆదాయం దాటని కుటుంబంలో ఒక పిల్లో, పిల్లాడో Vanderbilt లాంటి పెద్ద యూనివర్శిటీలో సీటు సంపాదించినా ఆ మిగిలిన 24 లక్షలు ఎక్క‌డ నుంచి తేవాలి? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

ఈ పథకాన్ని కుల,జాతి, మత,ప్రాంత బేధాలు లేకుండా అందరికీ వర్తింప జేస్తారట. అంటే ఏడాదికి ఇంతమందికి ఇస్తాం. ఇందులో ఎస్సీలకు ఇన్ని, ఎస్టీలకు ఇన్ని అనే రిజర్వేషన్ ఏమీ లేదు. దీంతో ఎవ‌రికి ఆ ప‌థ‌కం ఉందో వేరే చెప్ప‌న‌వ‌స‌రంలేదు. ఏ కులమైనా 60% శాతం మార్కులు వచ్చి వుండాలి. ఏ కులమైనా ఆదాయ పరిమితి 8 లక్షలే. ఏ కులమైనా వయోపరిమితి 35 సంవత్సరాలు. ఇలా ఎవ‌రికీ అంద‌నంత‌గా అద్భుతంగా జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దేవెన ప‌థ‌కాన్ని డిజైన్ చేశారు.

డబ్బున్నవాడు ఓ మూలనున్న యూనివర్శిటీలో సీటు సంపాదించి, రెండేళ్ళ కోర్సు అయిపోయాక H1 సంపాదించి ఒక చేత్తో భారతీయ సంప్రదాయాన్ని కాపుకాస్తూ, మరో చేత్తో డాలర్లను వడిసిపడుతూ వుంటే ఈ టాప్ యూనివర్శిటీల గొడవ ప్రభుత్వ లబ్దిదారులకే ఎందుకు? అనేది జ‌గ‌న స‌ర్కార్ స‌మాధానం చెప్పాలి.