ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (APGovt ) విద్యా రంగంలో ఒక గొప్ప సంస్కరణగా ‘నో బ్యాగ్ డే’ (‘No Bag Day’ ) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మరియు హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ (NaraLokesh) తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రతి శనివారం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు అమలు చేయబడుతుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు, వారిలో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రోత్సాహించడమే. ఈరోజు పుస్తకాలు మోసుకురావాల్సిన అవసరం లేకుండా, క్విజ్‌లు, వృత్తిపరమైన శిక్షణ, వాదప్రతివాదాలు, క్రీడా పోటీలు లాంటి అనేక ఇన్టరాక్టివ్ కార్యక్రమాలను నిర్వహించి వారిలో నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నారు.
విద్యార్థులలో కొత్త ఆలోచన విధానం
ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా రూపొందించబడింది. పార్లమెంట్ మాక్ సెషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్ బీ పోటీలు, క్లబ్ కార్యకలాపాలు, నైపుణ్య పరీక్షలు, కళలు, వినోద కార్యక్రమాలు, వృత్తిపరమైన విద్య, మరియు ప్రదర్శనా కళలు వంటి అంశాలను విద్యా ప్రణాళికలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు సరికొత్త నేర్చుకునే విధానాన్ని అలవర్చుకోవచ్చు. ప్రత్యేకంగా ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్’ విభాగం ద్వారా చిత్రలేఖనం, మట్టి మోడలింగ్, ఒరిగామీ, తోటపని వంటి సృజనాత్మక కార్యక్రమాలకు అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులలో కొత్త ఆలోచనా విధానాన్ని పెంపొందించనున్నారు.
పాఠశాలలు కేవలం పుస్తకాల నెత్తిన మోసే ప్రదేశాలు కాదు
మునుపటి ప్రభుత్వాల్లో తీసుకున్న అనుసంధాన రహిత విధానాల కారణంగా వేలాదిమంది విద్యార్థులు విద్యను మానేశారు. కానీ ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం ద్వారా చదువును మరింత ఆసక్తికరంగా, సులభంగా మార్చే ప్రయత్నం చేయబడుతుంది. విద్యార్థుల మనోభావాలను, వారి భవిష్యత్తు అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా పాఠశాలలు కేవలం పుస్తకాల నెత్తిన మోసే ప్రదేశాలుగా కాకుండా, ఆచరణాత్మకంగా నేర్చుకునే, నైపుణ్యాలను పెంపొందించే కేంద్రాలుగా మారబోతున్నాయి. నారా లోకేష్ విద్యా రంగాన్ని జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే సంకల్పంతో కృషి చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంభవించనున్నాయి.