No Alliance : 175 స్థానాల్లో పోటీకి చంద్ర‌బాబు దిశానిర్దేశం.! జ‌న‌సేన‌లో గుబులు!!

చంద్ర‌బాబునాయుడు పొత్తు(No Alliance) ఉండ‌ద‌నే సంకేతం మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర ఆఫీస్ లో జ‌రిగిన విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చారు

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 05:15 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు పొత్తు(No Alliance) ఉండ‌ద‌నే సంకేతం క్యాడ‌ర్ కు ఇచ్చేశారు. మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర ఆఫీస్ లో జ‌రిగిన విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం వారాహి యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్ స్పీచ్(Pawan) విన్న త‌రువాత చంద్ర‌బాబు తుది నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆ మేర‌కు దిశానిర్దేశం క్యాడ‌ర్ ఇచ్చారు. ద‌స‌రా రోజున ఫుల్ మేనిఫెస్టో విడుద‌ల చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా దిశానిర్దేశం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

పొత్తు ఉండ‌ద‌నే. చంద్ర‌బాబునాయుడు సంకేతం క్యాడ‌ర్ కు (No Alliance)

జనసేన‌, బీజేపీ క‌లిసి ఆడుతోన్న గేమ్ ను చంద్ర‌బాబు ప‌సిగట్టారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రువాతైన ఆ రెండు పార్టీలు ఇబ్బంది పెడ‌తాయ‌ని తెలుసుకున్నారు. పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు చెప్పిన‌ప్ప‌టికీ పొత్తు కోసం చంద్ర‌బాబు ఒక అడుగు ముందుకేశారు. ఆయ‌న ఢిల్లీలో అమిత్ షా ను క‌లిసిన త‌రువాత ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ను సంగ్ర‌హించారు. అలాగే, ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్నారు. దీంతో 175 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాల‌ని (No Alliance) చంద్ర‌బాబు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

పొత్తు పెట్టుకుంటే టీడీపీ  క్రేజ్ తగ్గిపోనుంద‌ని తాజా స‌ర్వేల ఫీడ్ బ్యాక్

వాస్త‌వంగా టీడీపీ, బీజేపీ పొత్తుతో 2014 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత 2018 నాటికి ఆ రెండు పార్టీలు ప్ర‌త్యేక హోదా విష‌యంలో విడిపోవ‌డం జ‌రిగింది. అయితే, హోదాను తెస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికీ ఆ ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు పైగా దేవుడి మీద ప్ర‌త్యేక హోదా భారాన్ని మోపారు. ఇదే స‌మ‌యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌, పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించ‌డం, అమరావ‌తి విష‌యంలో జ‌న‌సేన కుప్పిగంతులు వేస్తోంది. అలాంటి పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటే ప్ర‌స్తుతం టీడీపీకి ఉన్న క్రేజ్ తగ్గిపోనుంద‌ని తాజా స‌ర్వేల ఫీడ్ బ్యాక్. అందుకే, చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. పైగా పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ల‌ను కాద‌ని జ‌న‌సేన‌, బీజేపీ అభ్య‌ర్థుల‌కు పొత్తు (No Alliance) రూపంలో టిక్కెట్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ ఆలోచించిన త‌రువాత పొత్తుకు దండం పెట్టే దిశ‌గా చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

సీఎం ప‌ద‌వి మీద మోజుప‌డుతోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్

ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆశించ‌డంలేద‌ని ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌లో చెప్పారు. మరుస‌టి రోజే సీఎం రేస్ లో ఉన్నానంటూ నాలుక మ‌డ‌తేశారు. ఆ ప‌ద‌విని ఇస్తే సంతోషంగా తీసుకుంటాన‌ని ఆశ ప‌డుతున్నారు. బ‌లంలేక‌పోయిన‌ప్ప‌టికీ సీఎం ప‌ద‌వి మీద మోజుప‌డుతోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వాల‌కం టీడీపీ క్యాడ‌ర్ కు ఏ మాత్రం న‌చ్చ‌డంలేదు. గ‌తంలోనూ ఆయ‌న వాల‌కం కార‌ణంగా ప్ర‌భుత్వంలో కొన్ని మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధ‌ఙ ప‌రుగులు పెట్టాలంటే టీడీపీ ఒంటరిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుకుంటున్నారు. అందుకే, జ‌న‌సేన పార్టీని కూడా ప‌క్క‌న పెట్టేయాల‌ని క్యాడ‌ర్ భావిస్తోంది. ఆ దిశ‌గా ఆలోచించిన చంద్ర‌బాబు 175 స్థానాల్లో పోటీ చేయ‌డానికి(No Alliance) సిద్ధంగా ఉండాల‌ని విస్తృత స్థాయి స‌మావేశంలో చెప్ప‌డం కొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారితీయ‌నుంది.

 Also Read : TDP Twist : ముగ్గురి ముచ్చ‌ట‌! విజ‌య‌వాడ ఎంపీగా బాల‌య్య‌?

ఏపీలో బీజేపీ, జన‌సేన క‌లిసి పోటీచేసిన‌ప్ప‌టికీ ఎక్క‌డా డిపాజిట్లు రావ‌ల‌ని స‌ర్వేల సారంశం. తాజాగా ఐ ప్యాక్ చేసిన స‌ర్వేల‌న్నీ టీడీపీ ఒంటిరిగా బ‌రిలోకి దిగ‌డానికి ఇంత‌కంటే మంచిత‌రుణం లేద‌ని చెబుతున్నాయి. రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థాన న‌డ‌వాలంటే చంద్ర‌బాబు సీఎం కావాల‌ని 70శాతం మంది ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని స‌ర్వేల ఫీడ్ బ్యాక్. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ నిల‌క‌డ‌లేని వ్యాఖ్య‌లు పొత్తుకు న‌ష్టం చేస్తాయ‌ని కూడా తేల్చింది. అంతేకాదు, ప‌వ‌న్ తిడుతోన్న బూతులు, ఆయన స్పీచ్ ల్లోని అవ‌గాహ‌న రాహిత్యం గురించి ప్ర‌జ‌ల్లో చుల‌క‌న భావం ఉంద‌ని స‌ర్వేల్లో క‌నిపించిన వ్య‌తిరేక‌త‌. ఇలాంటి అంశాల దృష్ట్యా చంద్ర‌బాబు పొత్తుల(No Alliance) గురించి ఒక క్లారిటీ ఇస్తూ క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేయ‌డం జ‌న‌సేనకు గుబులు రేపుతోంది.

Also Read : CBN Manifesto 2.0 : టీడీపీ మేనిఫెస్టో 2.0 సిద్ధం! ప్ర‌చారానికి బ‌స్సు యాత్ర‌!!