Site icon HashtagU Telugu

YS Sharmila : ‘ప్రత్యేక హోదా’పై నితీశ్ మాట్లాడారు.. చంద్రబాబు ఎందుకు నోరువిప్పట్లేదు ? : షర్మిల

Ys Sharmila CHANDRA BABU

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఎన్డీయే కూటమిలోని తోటి కింగ్ మేకర్ నితీశ్ కుమార్ ధైర్యంగా బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడుగుతున్నారు. మరి అంతకంటే పెద్ద కింగ్ మేకర్ అయిన చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు ? ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు ?’’ అని షర్మిల ప్రశ్నించారు. నితీశ్ కుమార్‌లాగే చంద్రబాబు కూడా ధైర్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపై గొంతు వినిపించాలని ఆమె కోరారు. ఎన్డీయే కూటమిపై ఒత్తిడి పెంచితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు.  ఈమేరకు ఇవాళ షర్మిల(YS Sharmila) ఓ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు బిహార్ కంటే వెనకబడి ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా ?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు కావాలని మీరు అడిగిన రోజులు మీకు గుర్తుకు లేవా ?  అభివృద్ధి విషయంలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ?’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్డీయే కూటమికి మద్దతును ఉపసంహరించుకుంటామని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ? మోసం చేసిన మోడీతో ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరేంటో చెప్పండి చంద్రబాబు’’ అని షర్మిల తన ట్వీట్‌లో కీలక కామెంట్స్ చేశారు.

Also Read :1st Accused : కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు ఎవరిపై నమోదైందో తెలుసా ?

‘‘ఏపీకి రాజధాని లేకుండా చేసింది మాజీ సీఎం జగనే’’ అని షర్మిల మండిపడ్డారు.  ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర అసెంబ్లీలో  తీర్మానం చేయాలని టీడీపీ సర్కారు ఆమె డిమాండ్ చేశారు. ప్యాకేజీలతో తృప్తి చెందకుండా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని కోరారు. కాగా, కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో ప్రస్తుతం నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ, చంద్రబాబు రాజకీయ పార్టీ టీడీపీ కీలకంగా మారాయి. జేడీయూ వద్ద 12 ఎంపీ సీట్లు ఉండగా.. టీడీపీ వద్ద 16 ఎంపీ సీట్లు ఉన్నాయి.

Also Read :France Elections : మాక్రాన్‌కు షాక్.. ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన ఫలితం

Exit mobile version