Site icon HashtagU Telugu

Nirmala Sitharaman : అమరావతికి రూ.15వేల కోట్ల సాయంపై నిర్మలా సీతారామన్ క్లారిటీ

Union Budget 2025

Union Budget 2025

బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల యావత్ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని (Funds to AP in Union Budget) అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని అప్పుగా ఇస్తుందంటూ వైసీపీ (YCP) సహా పలువురు చేస్తున్న విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ పాల్లొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని విభజన చట్టంలో ఉందని, బడ్జెట్‌లో చెప్పిన రూ.15 వేల కోట్లు ప్రపంచబ్యాంకు రుణం తీసుకుంటున్నామని, అలాగే వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తిరిగి చెల్లింపులు ఎలా అనేది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని, రాష్ట్రానికి రాజధాని లేకుండా పదేళ్లు గడిచిపోయిందని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఈపాటికే రాజధాని పూర్తయి ఉండాలని తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల్లో నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ప్రత్యేకంగా విడుదల చేయనునట్లు తెలిపారు.

విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఉంటుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆర్ధికమంత్రి స్పష్టం చేశారు. అలాగే పాత పన్ను విధానాన్ని రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయడమే మా ఉద్దేశ్యం అని అన్నారు. 2025లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధమైన సమాధానం ఇచ్చారు.

Read Also : Naxalite Bandh: జులై 25న నక్సలైట్లు బంద్‌ కు పిలుపు