ఏపీ (AP) ఎన్నికలపైనే ఇప్పుడు చర్చంతా..గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ (YCP) మరోసారి విజయం సాధిస్తుందా..? లేక ఉమ్మడి పొత్తు పెట్టుకున్న టిడిపి – జనసేన (TDP – Janasena) కూటమి గెలుస్తుందా..? వీటి గెలుపుకు కాంగ్రెస్ (Congress) ఏమైనా అడ్డు తగులుతుందా..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో ఏ పార్టీ నుండి ఎవరు..ఏ స్థానం నుండి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ వరుస పెట్టి జాబితాలను రిలీజ్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టగా..ఇటు టిడిపి – జనసేన కూటమి అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో సోషల్ మీడియా లో పలు వార్తలు ప్రచారం అవుతూ..కార్యకర్తలను , పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి (Tirupati Assembly Constituency) మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక (Niharika) పోటీ చేస్తారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఈ వార్త చూసి మెగా అభిమానులతో పాటు జనసేన శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి..తిరుపతి నుండి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు అదే స్థానం నుండి మెగా ఫ్యామిలీ పోటీ చేస్తుందని తెలిసి అంత సంతోషం వ్యక్తం చేస్తూ..ఈసారి కూడా గెలుపు ఖాయం అంటూ మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు.
దీంతో హీరో వరుణ్ తేజ్..నిహారిక పోటీ క్లారిటీ ఇచ్చారు. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రచారంపై తమ కుటుంబంలో పెద్దల నిర్ణయమే ఫైనల్ అని , పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తామని పేర్కొన్నారు. తమ కుటుంబమంతా బాబాయ్ పవన్ వెంటే ఉంటామని తెలిపారు. దీంతో నిహారిక బరిలో నిల్చువడం అనేది అబద్దం అని తేలిపోయింది. ఇక నాగబాబు మాత్రం అనకాపల్లి నుండి పోటీ చేస్తారని , పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
Read Also : Lokesh VS Amarnath War : ఏపీలో తారాస్థాయికి చేరిన కోడిగుడ్డు-ముద్దపప్పు వివాదం