Site icon HashtagU Telugu

Janasena : బాబాయ్ కోసం ప్రచారం చేస్తానంటున్న మెగా డాటర్

Niharika Janasena

Niharika Janasena

పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక్క పిలుపు ఇస్తే చిత్రసీమ మొత్తం దిగుతుంది..ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాబాయ్ ఒక్క మాట..ఒకే ఒక మాట అంటే సినిమాలన్నీ పక్కన పెట్టి బాబాయ్ కోసం కష్టపడతాం అని ప్రతి వేదిక ఫై మెగా హీరోలు (Mega Heros) చెపుతూనే ఉంటారు. కానీ పవన్ మాత్రమే అందరిలా కాదు..ఎవరి సాయం తీసుకోడు..స్వశక్తితో ముందుకు నడవలే తప్ప ఒకరి సాయం తో గెలుపు..గెలుపు కాదంటాడు. అందుకే ఆగుతున్నారు తప్ప మరోటి కాదు. ఈసారి మాత్రం పవన్ వద్దన్నా..ఆయన పిలుపు కోసం కాదు ఆయన గెలుపు కోసం కష్టపడతాం అంటున్నారు చిత్రసీమలో కొంతమంది సినీ స్టార్స్.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బాబాయ్ కోసం నేను రెడీ అంటుంది మెగా డాటర్ నిహారిక (Niharika). గత ఎన్నికల్లోనూ తన బాబాయి, జనసేన తరఫున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తన బాబాయి పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనకు ఓటు సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు. గత ఎన్నికల్లో కూడా ఏపీలో ప్రచారం చేశానని.. ఈసారి కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు. బాబాయి తో వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపించిందని , అందుకే సాగు ఇండిపెండెంట్ ఫిల్మ్‌ వైపు కనెక్ట్ అయ్యానన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయని.. సాగులో చెప్పిన ఓ అంశంతోపాటు ఇంకా అనేక కారణాలతో వారు చనిపోతూ ఉంటారన్నారు. ఏమైనా పర్లేదు, అండగా ఉంటాం అనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ జీవితంలో ఏదైనా చేసేయొచ్చన్నారు.

నిహారిక , పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై “సాగు” అనే లఘు చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంప్రదాయానికి కట్టుబడిన సమాజంలో హరి, సుబ్బలక్ష్మి ప్రేమ అన్ని అసమానతలను ధిక్కరించి బీడు భూమికి నీళ్లను ఎలా తీసుకువచ్చారనేది కథాంశం. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో మార్చి 04 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లలో నిహారిక పాల్గొంటూ వస్తుంది.

Read Also : Nita Ambani: అనంత్‌ అంబానీ , రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక సందేశం