Site icon HashtagU Telugu

YCP : నెక్స్ట్ అరెస్ట్ అనిల్ కుమార్ యాదవేనా..? అక్రమ మైనింగ్ ఉచ్చు బిగిస్తుందా..?

Next Arrest Anilkumar

Next Arrest Anilkumar

వైసీపీ నేతలఫై వరుస కేసులు , అరెస్ట్ లు ఆయా నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నేతలు అరెస్టవగా, తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఇంకాస్త కాకరేపాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. తాజాగా క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నారు. ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి రావడంతో ఉత్కంఠ పెరిగింది.

పోలీసులు అరెస్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డి, తనపై విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు పేర్కొన్నట్లు సమాచారం. ఆయనతో కలిసి తాను మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నానని, వారి భాగస్వామ్యంతో పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా క్వార్ట్జ్ మైనింగ్ కొనసాగినట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. టన్నుకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు ఆధారాలు కూడా లభించాయి.

HHVM : సంధ్య థియేటర్ లో వీరమల్లు మార్నింగ్ షోలు క్యాన్సిల్..? అసలు నిజం ఏంటి..?

ఈ అక్రమ ఆదాయంతో అనిల్ కుమార్ యాదవ్ పలుచోట్ల భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించినట్లు పోలీసుల అన్వేషణలో వెల్లడైంది. గూడూరు-చెన్నూరు రోడ్డులో “గ్రీన్ మెడోస్”, నాయుడుపేట హైవే వెంబడి “స్వర్ణముఖి స్మార్ట్ సిటీ”, హైదరాబాద్ మణికొండలో “హెవెన్లీ హోమ్స్”, తుర్కయాంజల్ వద్ద “గ్రీన్ మెడోస్ హౌసింగ్” పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అనిల్ కుమార్ అక్రమ ఆదాయంతో నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అనిల్ కుమార్ పై మరిన్ని ఆధారాలు లభిస్తే త్వరలోనే అరెస్టు కూడా తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కేసు రాజకీయపరంగా కూడా పెద్ద దుమారానికి దారితీయవచ్చు. వచ్చే రోజులలో వైసీపీ నేతలపై మరిన్ని కేసులు నమోదవుతాయా అనే ఉత్కంఠ కూడా రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Roja : అసలు రోజా ఆడదో.. మగదో అర్ధం కావడం లేదు – జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు