Elephant Attacked: ఏనుగు ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన కొత్త జంట.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

సాధారణంగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు పెళ్లికి తర్వాత అనేక ప్రదేశాలకు తిరిగి ఫోటోలకు ఫోజులు

Published By: HashtagU Telugu Desk
Elephant Attack

Elephant Attack

సాధారణంగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు పెళ్లికి తర్వాత అనేక ప్రదేశాలకు తిరిగి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఇక ఫోటోలు దిగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే గజరాజులతో తెగ ఇష్టపడి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ విధంగానే తాజాగా కేరళలో కొత్తగా పెళ్లి అయిన ఒక జంట ఏనుగు ముందుకు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అప్పటివరకు బాగానే ఉన్నాయి నువ్వు ఆ తర్వాత కోపం వచ్చి ఊగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా కేరళ త్రిసూర్ లోని గురువాయుర్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొత్తగా పెళ్లయిన ఒక జంట మెడలో మాలలతో ఆలయ సమీపంలో ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్లారు. ఏనుగు దానిపని అది చేసుకుంటూ ఉండగా ఈ జంట ఆ ఏనుగుని డిస్టర్బ్ చేయకుండా నిలబడి ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లు కూడా వివిధ స్టిల్స్ లో జంటకు ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ గజరాజు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. అంతే కాకుండా అక్కడున్న వారిపై దాడికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఏనుగుపై ఉన్న మామటి ఆ ఏనుగును అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఒక అతన్ని ఎత్తి మరి కిందకు విసిరేసింది.

అయితే ఆ వ్యక్తిని పైకెత్తినప్పుడు అతని బట్టలు జారిపోవడంతో అదృష్టవశాత్తు ఆ వ్యక్తి అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకొని బయటపడ్డాడు. ఈ క్రమంలోనే అతని శరీరంపై ఉన్న బట్టలు మొత్తం ఊడిపోయాయి. ఆ ఏనుగు పై ఉన్న మావటి అదుపు చేయడంతో ఆ గజరాజు మౌనంగా ఉండిపోయింది. కొద్ది క్షణం పాటు అక్కడున్న భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  Last Updated: 05 Dec 2022, 06:11 PM IST