TTD Good News : కొత్తగా పెళ్లయ్యే జంటలకు శుభవార్త. కొత్త జంటలకు ఉచితంగా శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదంను పోస్టులో పంపాలని టీటీడీ నిర్ణయించింది. అయితే ఇందుకోసం కొత్తగా పెళ్లయ్యే జంటలు వారి పూర్తి చిరునామాతో శుభలేఖను టీటీడీకి పంపాల్సి ఉంటుంది. ఇలా శుభలేఖను పంపేవారి ఇంటి అడ్రస్‌కు ప్రసాదం కిట్‌ను టీటీడీ నుంచి పోస్ట్ చేస్తారు. ఈవిధంగా కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులను అందుకోవచ్చు. వాస్తవానికి గతంలోనే ఈ విధానం అమల్లో ఉండేది. కానీ కరోనా సంక్షోభ సమయంలో ఈ ఉచిత సేవను టీటీడీ నిలిపివేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడు మళ్లీ కొత్త జంటలకు ఈ అవకాశం కల్పించనున్నారు. నూతన వధూవరులు తమ శుభలేఖ, పూర్తి అడ్రస్ వివరాలను పంపాల్సిన చిరునామా ఏమిటంటే.. ‘‘ శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈఓ ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి 517501’’. పెళ్లి ముహూర్తానికి నెల రోజుల ముందుగా పెళ్లి కార్డును పంపాల్సి (TTD Good News) ఉంటుంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమ, కంకణం, శ్రీవారి ఆశీస్సులతో కూడిన తలంబ్రాలను పంపుతారు.