Site icon HashtagU Telugu

TDP : ఏపీలో జనవరి నుండి కొత్త రేషన్‌ కార్డులు జారీ..!

New Ration Cards Issued In

New ration cards issued in AP from January..!

New Ration Cards : ఏపీలో వచ్చే ఏడాది జనవరి నుండి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హత కలిగిన వారికి రేషన్ కార్డ్ ఇచ్చేలా కసరత్తు ప్రారంభించారు. పాత రేషన్ కార్డ్ లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలని ప్రభుతం ప్లాన్ చేస్తుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో రేషన్ అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంది. అందుకే అర్హత లేని వారికి రేషన్ ఉండకూడదని చూస్తుంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రేషన్ ఉన్న వారికి కూడా రీ డిజైన్ చేసి అందించేలా చూస్తున్నారు. రేషన్ కార్డ్ రంగు, ముద్ర కూడా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డ్ రంగు మారడం జరుగుతుంది. ఏపీలో రేషన్ కార్డులు పసుపు రంగు ఇంకా రాష్ట్ర అధికారిక చిహ్హ్నాన్ని ముద్రించి ఉన్నది నమూనా పంపించారు. అది ఆమోదిస్తె అదే కొత్త కార్డు నమూనా అవుతుంది. ఇక గత ప్రభుత్వంలో కొత్తగా 30611 దరఖాస్తులు రాగా.. 213000 దరఖాస్తులు కొత్తగా వచ్చినట్టు తెలుస్తుంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో 1.48 కోట్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిని మళ్లె రీడిజైన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్డులకు ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులపై రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు వంటి సరుకులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన ఆర్థిక భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

Read Also :Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్‌ అసెంబ్లీ సమావేశం