AP BJP President : త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికార పీఠంపై ఉన్నందున ఈ పదవికి భారీ పోటీ నెలకొంది. చాలామంది నాయకులే ఈ పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో సీనియర్ నేతలు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, యువనేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ప్రభావం రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ సామాజిక వర్గం వారికి ఈసారి బీజేపీ అధ్యక్ష పీఠాన్ని అప్పగిస్తే.. రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణకు రాజకీయంగా కలిసొస్తుంది అనే కోణంలో పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. దీనిపై బీజేపీలోని ముఖ్య నేతలందరి ఫీడ్ బ్యాక్‌ను కూడా ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద బీజేపీ భావజాలాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లే వారికే ఈ పదవిని అప్పగించే ఛాన్స్ ఉంది.
Also Read :Kalvakuntla Kavitha : ‘తెలంగాణ జాగృతి’తో కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్.. వాట్స్ నెక్ట్స్ ?
సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి.. ఇద్దరూ రాజకీయాల్లో సీనియర్లే. అయితే వారు ఇటీవల కాలంలోనే బీజేపీలో చేరారు. బీజేపీ భావజాలాన్ని(AP BJP President) ప్రతిబింబించే కోణంలో గతంలో వారు పనిచేసిన దాఖలాలు లేవు. ఈ కోణంలో వీరిద్దరికీ మైనస్ పాయింట్లు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. వారి బిజీ షెడ్యూల్‌లో నుంచి విలువైన సమయాన్ని పార్టీకి కేటాయించడం కష్టతరం అవుతుంది. అందుకే పూర్తిస్థాయి సమయాన్ని పార్టీకి కేటాయించే యువ నేతలకే అవకాశం ఇవ్వాలని బీజేపీలో చాలా ఏళ్లుగా ఉంటున్న నేతలు వాదిస్తున్నారు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారికే.. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కాలని వారు అంటున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగిస్తే.. వారు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంటుందని పలువురు బీజేపీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన
ప్రస్తుతం బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్‌లకు ప్లస్ పాయింట్లే తప్ప.. మైనస్ పాయింట్లు లేవని తెలుస్తోంది. ఏపీలోని బీజేపీ సీనియర్ నేతల నుంచి వారి గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్లినట్లు సమాచారం. వారిద్దరికీ ఆర్‌ఎస్ఎస్, బీజేపీ నేపథ్యం ఉంది. ఏబీవీపీలోనూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంత నేతకు ఏపీ బీజేపీ చీఫ్ పదవి దక్కలేదు. ఈనేపథ్యంలో ఈసారి ఆ ప్రాంతానికి చెందిన వారికి పార్టీ రాష్ట్ర చీఫ్ పగ్గాలను అప్పగిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.