Site icon HashtagU Telugu

New Policy : ఏపీలో బార్లకు కొత్త పాలసీ…వివరాలు ఇవే..!!

Delhi Liquor

Liquor

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం చేపట్టాక మద్యం పాలసీ రూపురేఖలు మార్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో బార్లకు కొత్త పాలసీని ప్రకటించింది సర్కార్.

1. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలనేది ఎక్సైజ్ కమిషన్ నిర్ణయిస్తుంది.

2. మున్సిపల్ కార్పొరేషన్ లో 10కి. మీ పరిధిలో మున్సిపాలిటీల్లో 3కి.మీ పరిధిలో బార్లు ఏర్పాటు చేయవచ్చు.

3. 3 సంవత్సరాల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు

4. బార్లకు లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంవత్సరానికి 10శాతం పెంచుతారు.

5. ఈ కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీలో ఉన్న బార్ల లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడగించారు. వాస్తవానికి బార్ల లైసెన్సులు ఈ నెలాఖరుతో ముగుస్తాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బార్ల లైసెన్సుల కాలపరిమితి జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడగించారు. లైసెన్సులు పొడిగించిన కాలానికి ప్రభుత్వం ఈనెల 27న బార్ల నుంచి ఫీజులు వసూలు చేస్తుంది.

Exit mobile version