Site icon HashtagU Telugu

New party secret : చంద్ర‌బాబు చ‌తుర‌త‌పై జ‌గ‌న్ హైరానా! BCYP ర‌హ‌స్య కోణం.!!

New Party Secret

New Party Secret

అమ‌రావ‌తిలో జ‌రిగిన టిట్కో ఇళ్ల పునాది వేసిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో `కొన్ని సంఘాలు` (New party secret)చంద్ర‌బాబుకు అనుకూలంగా త‌యార‌య్యాయ‌ని కామెంట్ చేశారు. మునుపెన్న‌డూ లేనివిధంగా కొత్త పార్టీ ఆవిర్భావం జ‌రిగిన మ‌రుస‌టి రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఆవిర్భావం వెనుక చంద్ర‌బాబునాయ‌కుడు ఉన్నార‌నే సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఆవిర్భ‌వించిన కొత్త పార్టీ వెనుక ఎవ‌రున్నారు? ఆ పార్టీ ఆవిర్భావం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌డం కోసం పెట్టిన నిధులు ఎక్కడివి? అనే ప‌శ్న‌ల‌కు సమాధానం దొర‌కడంలేదు.

కొన్ని సంఘాలు చంద్ర‌బాబుకు అనుకూలంగా త‌యార‌య్యాయ‌ని.(New party secret)

దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ గ‌త కొన్ని నెల‌లుగా విస్తృత ప్ర‌చారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు దానికి కొన్ని సంఘాల‌ను  (New party secret)జోడించారు. ఆ సంఘాలు చంద్ర‌బాబునాయుడికి అనుకూలంగా ప‌నిచేస్తున్నాయ‌ని అమ‌రావ‌తి కేంద్రంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబు వేసే ఎత్తుగ‌డ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ద‌త్త‌పుత్రుడు నుంచి దుష్ట‌చ‌తుష్ట‌యం గురించి చెబుతూ కొన్ని సంఘాల‌ను కూడా రాజ‌కీయ రొచ్చులోకి లాగారు. ఏఏ సంఘాలు టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నాయో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా, జ‌న‌సేన పార్టీని టార్గెట్ చేశారు. కొత్త పార్టీ వ‌చ్చిన మ‌రుస‌టి రోజే సంఘాల గురించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హైరానా ప‌డుతున్నారు.

కొత్త పార్టీ వ‌చ్చిన మ‌రుస‌టి రోజే సంఘాల గురించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

కొన్ని సంఘాల మ‌ద్ద‌తుతో చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రైతు బోడే రామచంద్ర యాదవ్ ఆదివారం భరత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) పార్టీని.(New party secret) ప్ర‌క‌టించారు. ఆ సభ‌కు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ , సూరజ్ మండల్, మనవడు బి.పి. మండల్ (మండల్ కమీషన్ చైర్మన్) తదితరులు హాజర‌వ్వ‌డాన్ని ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP), TDP , కాంగ్రెస్ పార్టీల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యమని రామ‌చంద్ర‌న్ వెల్ల‌డించారు.

ఏపీ విభజనను పార్టీలేవీ ఆపలేద‌ని ఆరోప‌ణ‌ల‌కు(New party secret) 

సంక్షేమ పథకాల అమలులో వెనుకబడిన తరగతులు (బీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు వైఎస్సార్సీపీ, టీడీపీలు దూరమయ్యాయని ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు రాజకీయంగా వెనుకబడి ఉండేలా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ హామీ ఇచ్చాయని రామ‌చంద్ర‌న్ విమ‌ర్శించారు.ఏపీ విభజనను ఆ పార్టీలేవీ ఆపలేద‌ని (New party secret) ఆరోప‌ణ‌ల‌కు దిగారు. మద్యం వ్యాపారం, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ముఖ్యమంత్రి జ‌గ‌న్ కు ద‌క్కేంత‌గా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంద‌ని దుయ్య‌బట్టారు.

వైసీపీ నుంచి బీసీల‌ను లాగేసుకోవ‌డానికి  మొద‌ల‌యింద‌ని వైసీపీ అనుమానం

కొత్త పార్టీ చీఫ్ రామ‌చంద్ర‌యాద‌వ్ చేసిన ప్ర‌సంగంలోని సారంశాన్ని తీసుకుంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ ప‌రంగా దాడికి దిగారు. రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి అనుకూలంగా స్పీచ్ ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వం కూడా రాజ‌ధాని అభివృద్ధి చేయ‌లేక‌పోయింద‌ని చెబుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అమ‌రావ‌తిని (New party secret)  కూల్చేసిన విష‌యాన్ని ఎత్తిచూపారు. సామాజిక స‌మీక‌ర‌ణాన్ని న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇప్పుడు రామ‌చంద్ర‌యాద‌వ్ రూపంలో న‌ష్ట‌మ‌నే భావానికి వ‌స్తున్నారు.

Also Read : Pawan Arrest Notice : BJP డైరెక్ష‌న్లో YCP, జ‌న‌సేన పొలిటిక‌ల్ డ్రామా

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్బంగా టీడీపీకి సాలిడ్ గా ఉండే బీసీ ఓట‌ర్లు వైసీపీ వైపు వెళ్లారు. ఇప్ప‌టికీ వాళ్లు టీడీపీ వైపు పూర్తిగా రాలేద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, రామ‌చంద్ర‌యాద‌వ్ పెట్టిన కొత్త పార్టీ రూపంలో వైసీపీ నుంచి బీసీల‌ను లాగేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం మొద‌ల‌యింద‌ని వైసీపీ అనుమానం. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ మ‌ధ్య ప‌ది శాతం ఓటు వ్య‌త్యాసం ఉంద‌ని స‌ర్వేల అంచ‌నా. దాని ప్ర‌కారం 5శాతం ఓట్ల‌ను క‌నీసంగా వైసీపీ నుంచి చీల్చ‌డానికి చంద్ర‌బాబు వేసిన ఎత్తుగ‌డ పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ గా ఆలోచిస్తున్నారు. అందుకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌తో కూడిన కొత్త పార్టీని రామ‌చంద్ర యాద‌వ్  (New party secret)ప్ర‌క‌టించార‌ని అనుమానిస్తున్నారు.

Also Read : Pawan Kalyan Tweet: వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి: పవన్ కళ్యాణ్

గుంటూరు కేంద్రంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ప‌దుల కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్టు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అంచ‌నా వేస్తోంది. ఆ నిధులను ఎవ‌రు స‌మ‌కూర్చారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌లో భాగంగా ఈ కొత్త పార్టీ ఆవిర్భావం జ‌రిగింద‌ని మెజార్టీ నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళుతోన్న బీసీల‌ను ఆప‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రోద్భ‌లంతోనే కొత్త పార్టీ ఆవిర్భ‌వించింద‌ని మ‌రో వాద‌న ఉంది. అదే నిజ‌మైతే, అమ‌రావ‌తి ఇళ్ల శంకుస్థాప‌న సంద‌ర్భంగా కొన్ని సంఘాలు కూడా చంద్ర‌బాబుకు అండ‌గా దుష్ట‌చ‌తుష్ట‌యంతో పాటు తోడ‌య్యాయ‌ని వ్యాఖ్యానించరు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్త పార్టీ వెనుక ఉన్న ర‌హ‌స్య కోణం బ‌య‌ట‌ప‌డాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.!