New Parties in AP : కొత్త పార్టీల వెనుక బూచోడు?

ఎన్నిక‌ల‌ప్పుడు కొత్త పార్టీలు(New Parties in AP)పురుడుపోసుకోవ‌డం కొన్నేళ్లుగా చూస్తున్నాం. వాటి వెనుక ఎవ‌రు ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు?

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 04:59 PM IST

ఎన్నిక‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు కొత్త పార్టీలు(New Parties in AP)పురుడుపోసుకోవ‌డం గ‌త కొన్నేళ్లుగా చూస్తున్నాం. కానీ, వాటి వెనుక ఎవ‌రు ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు? అనేది మాత్రం ఇతిమిద్దంగా తొలి రోజుల్లో అర్థం కాదు. మ‌రో రెండు పార్టీలు ఇప్పుడు ఏపీలో పుట్టుకురాబోతున్నాయి. వాటి టార్గెట్ భిన్నంగా ఉంది. సినీ గేయ‌ర‌చ‌యిత జొన్నిత్తుల పెట్టే పార్టీ పేరు `జై తెలుగు. ఆ పార్టీ ల‌క్ష్యం తెలుగు భాష‌ను కాపాడుకోవ‌డ‌మ‌ట‌. ఇక ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రామ‌చంద్ర యాద‌వ్ ఈనెల 23న కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌బోతున్నారు. దాని పేరు ఇంకా బయ‌ట‌కు రాన‌ప్ప‌టికీ ఈనెల 23 నాగార్జున సాగ‌ర్ ఎదురుగా ఉండే గ్రౌండ్స్ లో ప్ర‌జా సింహ‌గ‌ర్జ‌న పెట్ట‌బోతున్నారు. ఆ వేదిక ద్వారా కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దాని ల‌క్ష్యంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించ‌డమ‌ని అంటున్నారు.

ఏపీ లో మ‌రో రెండు పార్టీలు (New parties in AP)

ఏపీలో తెలుగు భాష‌ను పాఠ‌శాల‌ల్లో లేకుండా చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ గా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మార్చేస్తున్నారు. ఫ‌లితంగా తెలుగు భాష క‌నుమ‌రుగు కానుంద‌ని భాషా ప్రేమికులు అందోళ‌న చెందుతున్నారు. అయితే, ఐదో త‌ర‌గ‌తి ఒక ఒక స‌బ్జెక్టుగా మాత్ర‌మే తెలుగు ఉంది. తెలుగు మీడియం అనేది లేకుండా చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సర్కార్ దూకుడుగా వెళుతోంది. ఆ క్ర‌మంలో `జై తెలుగు` పేరుతో కొత్త పార్టీని (New Parties in AP)పెట్ట‌డానికి జొన్న‌విత్తుల సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఆయ‌న వెనుక ఎవ‌రు ఉన్నారు? అనేది మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం సినిమా రంగంలోకి ప‌లువురు తెర వెనుక ఆయా పార్టీల‌కు పనిచేస్తున్నారు. మ‌ధ్యే మార్గంగా ఉండే జొన్న విత్తుల స్టాండ్ ఏమిటి? అనేది బోధ‌ప‌డ‌డంలేదు.

జై తెలుగు` పేరుతో  జొన్న‌విత్తుల   కొత్త పార్టీ 

తెలుగును కాపాడుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష టీడీపీ ప‌నిచేస్తోంది. దానికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ద్వారా తెలుగు భాష‌ను ర‌క్షించుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, తెలుగు భాష‌ను కాపాడిన వాళ్ల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను స్మ‌రించుకున్నారు. కానీ, చంద్ర‌బాబునాయుడు గురించి ప్ర‌స్తావించ‌లేదు. అంటే, తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రుల‌ను చీల్చే ప్ర‌య‌త్నం తెర వెనుక జొన్న‌విత్తుల ద్వారా జ‌రుగుతుందా? అనేది అనుమానం. పైగా `జై తెలుగు` అంటూ తెలుగుదేశం పార్టీ పేరు స్పురించేలా పార్టీ నామ‌క‌ర‌ణం చేశారు. అంతేకాదు, ఒక‌ప్పుడు మ‌ద‌రాసీలు అనే తెలుగు వాళ్లను ఇప్పుడు హైద‌రాబాదీయులు అంటున్నార‌ని క‌విత్వాన్ని జోడిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఒకే తెలుగు భాష ఉంద‌ని, ఏపీలో ప‌లు ర‌కాలుగా ఉంద‌ని ముక్తాయించారు.

Also Read : Jagan manifesto : ఫోన్‌, టీవీ రీచార్జి ఫ్రీ మేనిఫెస్టో? జ‌గ‌న్ కు రిల‌యెన్స్ స‌హ‌కారం!

వాస్త‌వంగా తెలంగాణ‌లోని జిల్లాల్లో విభిన్నంగా యాస ఉంటుంది. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లోని భాష యాస ద‌క్షిణ తెలంగాణాల్లో వినిపించ‌దు. ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో తెలంగాణ యాస విభిన్నం. వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ యాస భిన్నం. అలాగే, ఏపీలోనూ రాయ‌ల‌సీమ యాస‌, ఉత్త‌రాంధ్ర యాస విభిన్నంగా ఉంటాయి. ఇక కోస్తాంధ్ర భాషలోని యాస ప్ర‌త్యేకంగా ఉంటుంది. కానీ, తెలంగాణ భాష‌ను ఆకాశానికి ఎత్తుతూ ఏపీ తెలుగు భాష‌ను చీల్చేశారు. అంటే, ఏదో రాజ‌కీయ కుట్ర జొన్న విత్తుల పార్టీ (New Parties in AP) వెనుక ఉంద‌ని అనుమానం క‌లుగ‌క మాన‌దు.

బీసీ ఓటు బ్యాంకు మీద టీడీపీ పునాదులు

వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, కాపులు క‌లిసి ఒక కొత్త పార్టీని పెట్టాల‌ని ఏపీలోని కొంద‌రు ప్ర‌య‌త్నం చేశారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కాపు, బీసీలు ఎప్పుడు క‌ల‌వ‌రు. అందుకే, ఆ సామాజిక‌వ‌ర్గాల లీడ‌ర్లు కూడా ఒక వేదిక మీద‌కు రాలేక‌పోయారు. వైసీపీలోని కొంద‌రు కాపు లీడ‌ర్లు కొత్త పార్టీ కోసం ఇటీవ‌ల సంప్ర‌దింపులు జ‌రిపారు. కానీ, ఆ ఆలోచ‌న కార్యారూపం దాల్చ‌లేదు. హ‌ఠాత్తుగా ఇప్పుడు బీసీ నాయ‌కునిగా పారిశ్రామిక‌వేత్త రామ‌చంద్ర యాద‌వ్ తెర మీద‌కు కొత్త పార్టీని తీసుకొచ్చారు. ఆయ‌న వెనుక ప‌క్కాగా వైసీపీ ఉంద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే, బీసీ ఓటు బ్యాంకు మీద టీడీపీ పునాదులు ఉన్నాయి. వాటిని క‌దిలించ‌డం ద్వారా 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. ఇప్పుడు బీసీలు తిరిగి టీడీపీ గూటికి చేరార‌ని తాజా స‌ర్వేల్లోని వైసీపీ ఫీడ్ బ్యాక్. అందుకే, ఆ ఓటు బ్యాంకును చీల్చ‌డానికి కొత్త పార్టీని(New Parties in AP) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ కో పెట్టిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ క‌లిశారు. ఆ త‌రువాత రోజే జొన్న‌విత్తుల కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌డం ప‌లు అనుమానాల‌కు దారితీస్తోంది. అలాగే, ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్న రెండో రోజుల‌కు రామ‌చంద్ర యాద‌వ్ కొత్త పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంటే, వీళ్లిద్ద‌రి వెనుక ఎవ‌రు ఉన్నారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో సీరియ‌స్ గా జ‌రుగుతోన్న చ‌ర్చ‌.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!