ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మే నెల మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక రేషన్ కార్డుల పంపిణీపై ప్రజల్లో నెలకొన్న అనేక అనుమానాలకు తెరపడింది. కొత్త కార్డులను ఈ నెల ఆగస్ట్ 25 నుంచి 31 వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ స్మార్ట్ రేషన్ కార్డులు QR కోడ్ తో డిజిటల్ విధానంలో ముద్రించబడతాయని మంత్రి వివరించారు. ఇవి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల్లా ఉండి, సులభంగా తీసుకెళ్లదగిన విధంగా రూపొందించబడ్డాయని చెప్పారు. ఈ కార్డులను రేషన్ షాపుల్లో ఈ-పోస్ యంత్రాలతో స్కాన్ చేసి, రేషన్ సరుకులు పొందవచ్చని వివరించారు. స్కాన్ చేసిన వెంటనే కుటుంబ వివరాలు, లబ్దిదారులకు అర్హతల వివరాలు కనిపిస్తాయని అన్నారు. ఇకపై రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు.
Breakup : బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మీరు ఫుల్ హ్యాపీ
ఇప్పటివరకు కొత్త కార్డులకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 9 లక్షలు, మార్పులు-చేర్పుల కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య 16 లక్షలు దాటినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.45 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. కార్డులో యజమాని మరియు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని స్పష్టంగా తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి ఆధునికీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కొత్త స్మార్ట్ కార్డుల ముద్రణ కోసం ఇటీవల ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం కార్డుల ముద్రణ వేగంగా జరుగుతోందని, అన్ని అర్హులకూ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సమయానికి రేషన్ కార్డు అందేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంలు నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడనుందని, భవిష్యత్‌లో డిజిటల్ సేవల విస్తరణకు ఇదొక మైలురాయిగా నిలవనుందని అభిప్రాయపడ్డారు.