ఏపీ (AP) ఆదాయ వనరుల నిర్వహణలో తన సమర్థతను మరోసారి చాటింది. 2024 నవంబర్, డిసెంబర్‌లో ఆదాయ వృద్ధిలో నెగటివ్ ట్రెండ్ కనిపించినప్పటికీ, 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో తిరిగి ఊపందుకుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2025లో రాష్ట్రం రూ. 3,354 కోట్ల నికర జీఎస్టీ (GST) వసూళ్లను నమోదు చేసింది. ఇది జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లుగా నిలిచింది.
HIT 3 : నానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన రామ్ చరణ్
రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు విడుదల చేసిన ప్రకటనలో “జీఎస్టీ వసూళ్లలో కొనసాగుతున్న పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని, పన్నుల వినియోగంలో పారదర్శకత, కట్టుదిట్టమైన అమలుతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి” అని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) సెటిల్‌మెంట్ కింద రాష్ట్రానికి రూ. 1,943 కోట్లు లభించాయి. ఇది కూడా 2017లో APGST చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన IGST సెటిల్‌మెంట్ కావడం గమనార్హం.
Vijay-Rashmika : మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక – విజయ్ దేవరకొండ
ఈ వృద్ధి ముఖ్యంగా నికర వసూళ్ల పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ఖర్చులకు ఉపయోగపడే వాస్తవ ఆదాయాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2025 నాటికి IGSTలో ఉన్న లోటును సమానంగా చేయడానికి ఏప్రిల్ నెలలో రూ. 796 కోట్లను ముందస్తు విడతగా అప్పుడే డెడక్ట్ చేసిందని ప్రకటనలో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఏప్రిల్ నెల వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా బలమైన స్థితిని చాటుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.