నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోటంరెడ్డి బ్రదర్స్ టీడీపీలోకి వస్తున్నారు. నేడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న టీడీపీ క్యాడర్‌కు నెల్లూరు జిల్లా నుంచి గిరిధర్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆ జిల్లాలో టీడీపీ మరింత బలపడనుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి నియోజకవర్గంలో రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఇప్పటికే శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానాన్ని విభేధించి బయటికి వచ్చారు. మరో ఏడాది పాటు పదవిలో ఉండటంతో ఆయన సోదరుడిని టీడీపీలో చేర్పించి ఆయన టీడీపీకి మద్దతు ఇవ్వనున్నారు.గిరిధర్ రెడ్డి చేరక సందర్భంగా ఇటు నెల్లూరు, అటు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా పసుపుమయమైంది. పార్టీలోకి స్వాగతం అంటూ గిరిధర్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ప్లెక్సీలు కట్టారు.
Kotamreddy Giridhar Reddy : పసుపుమయమైన నెల్లూరు.. నేడు టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోటంరెడ్డి బ్రదర్స్ టీడీపీలోకి వస్తున్నారు. నేడు మంగళగిరి కేంద్ర

Kotamreddy
Last Updated: 24 Mar 2023, 07:30 AM IST