Yuvagalam : యువ‌గ‌ళంలో అన్నీ తానై.. సొంత జిల్లాలో యాత్ర‌కు దూర‌మైన నేత.. కార‌ణం ఇదేనా..?

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. చిత్తూరు నుంచి

  • Written By:
  • Updated On - June 20, 2023 / 09:01 PM IST

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. చిత్తూరు నుంచి మొద‌లైన ఈ యాత్ర‌ను కోఆర్డినేట్ చేస్తూ అన్నీ తానై న‌డిపించిన ఆ యవ‌నేత త‌న సొంత జిల్లాలో పాద‌యాత్ర‌కు దూర‌మైయ్యారు. ఇంత‌కీ ఆ నేత ఎవ‌రు.. ? పాద‌యాత్ర‌కు ఎందుకు దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది..?

తెలుగుదేశం పార్టీలో సాధార‌ణ కార్య‌క‌ర్త స్థాయి నుంచి వివిధ ప‌దువులు పొంది రాష్ట్ర స్థాయి నేత‌గా ఎదిగారు బీసీ నేత, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర యాద‌వ్‌. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది పార్టీలు మారిన ఆయ‌న మాత్రం తాను న‌మ్ముకున్న పార్టీలోనే ఉన్నారు. అధినేత చంద్ర‌బాబుకు ప్రియ‌శిష్యుడిగా.. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కు అనుచ‌రుడిగా ఉంటూ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీదాకు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌రించింది. మండ‌లిలో ఇత‌ర స‌భ్యుల‌తో పాటు తాను అధికార‌ పార్టీ ధీటుగా ఎదుర్కొన్నారు. తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డితో క‌లిసి బీదా ర‌విచంద్ర చూస్తున్నారు. యాత్ర‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా క‌ష్ట‌ప‌డ్డారు.

Beeda Ravi Chandra Yadav

కీల‌కంగా ఉన్న రాయ‌ల‌సీమ జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు.. లోకేష్ యాత్ర‌ను స‌క్సెస్ చేయాల‌నే ధృడ‌సంక‌ల్పంతో ఆయ‌న ఉన్నారు. రాయ‌ల‌సీమ జిల్లాల్లో నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇవ‌న్నీ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు ఇబ్బందికరంగా ఉంటాయ‌ని గ్ర‌హించిన బీదా ర‌విచంద్రా.. నాయ‌కుల మ‌ధ్య స‌హోధ్య కుదుర్చుతూ యాత్ర‌ను స‌క్సెస్ చేపించారు. రాయలసీమ ప్రాంతం లో జరిగిన యువగళం పాదయాత్ర ను న భూతో న భవిష్యత్ అనిపించారు. అదే స‌యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ జిల్లాలో బీద త‌న మార్క్‌ని చూపించారు. ఎమ్మెల్సీలు కంచ‌ర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజ‌యంలో బీద త‌న వంతు కృషి చేశారు.

అయితే రాయలసీమలో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ ముగించుకుని నెల్లూరు జిల్లా లోకి ప్రవేశించాక జిల్లాలో ఖ‌చ్చితంగా బీద రవిచంద్ర యాదవ్ మార్క్ కనిపించబోతుందని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు భావించారు. నెల్లూరు జిల్లా లో తన మార్క్ చూపే లోపే ఆయన కాలికి గాయం కావడం డాక్టర్ లు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించడం వంటి అంశాలు ఆయనను పాదయాత్రకు దూరం చేశాయి. బీద రవిచంద్ర కు కాలి గాయం కాకపోయి ఉంటే నెల్లూరు జిల్లా పాదయాత్ర లో మరోసారి బీద మార్క్ కనిపించేది.