Site icon HashtagU Telugu

Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గింపు.. కోటంరెడ్డి కౌంటర్.!

Kotamreddy Sridhar

Kotamreddy Sridhar

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. దీనిపై స్పందించినన కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి తాను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. తాను ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతానని, భయపడనని స్పష్టం చేశారు.

మరోవైపు.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మంత్రి కాకాణి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోటంరెడ్డి పెద్ద గొంతు వేసుకుని మాట్లాడితే భయపడేది లేదంటూ మంత్రి కాకాణి అన్నారు. నా గొంతు పెరిగేదే తప్ప తగ్గేదే లేదంటూ కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. గన్‌మెన్లను తొలగించిన ప్రభుత్వానికి నేనే గిఫ్ట్ ఇస్తాను. వైఎస్ విగ్రహం పెడుతుంటే ఎందుకు అడ్డుకున్నారంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు.

Also Read: AP Constable Results: ఏపీ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. 95,208 మంది అభ్యర్థులు అర్హత..!

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం పార్టీ దృష్టిలో సమస్యగా మారడంతో సొంత పార్టీ మంత్రులు, నేతలు ఆయన ఆరోపణలను తప్పుబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని, టీడీపీలో చేరాలనే ఆలోచనతోనే వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రెస్ మీట్ పెట్టి.. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో తనకు తెలుసునని అన్నారు. తన ఫోన్‌పై విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు ప్రభుత్వం లేఖ రాయగలదా అని ఆయన ప్రశ్నించారు.

నెల్లూరు రూల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేసు రోజురోజుకు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో ఆయనకు భద్రత కూడా తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే జరిగింది కూడా. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే కాకుండా ఇటీవల పార్టీ విధానాలను తప్పుబడుతున్న మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా భద్రత తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో పార్టీ నేతలు, పెద్దలు చర్చల ద్వారా ఎలాగైనా తేల్చుకోవాలని ప్రయత్నించారు. అయితే రెండు ప్రెస్ మీట్లు పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను బయటపెడతానని చెప్పడంతో పార్టీ కూడా ఆయన్ను వదులుకోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.