MLA Anil Kumar Yadav : ప్రాణం ఉన్నంతవరకు వైసీపీని వీడను.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన బాహుబలి స్టోరీ..

అనిల్ కుమార్ యాదవ్ తాను పార్టీ మారుతాను అనే ఆరోపణలపై స్పందిస్తూ.. నా గుండె చప్పుడు జగన్. నా బ్లడ్ లో అణువణువు జగన్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదు.

Published By: HashtagU Telugu Desk
Nellore MLA Anil Kumar Yadav fires on Nellore YCP Leaders

Nellore MLA Anil Kumar Yadav fires on Nellore YCP Leaders

వైసీపీ(YCP)లో గట్టిగా మాట్లాడే నాయకులలో నెల్లూరు(Nellore) ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) ఒకరు. కానీ గత కొన్ని రోజులుగా అనిల్ యాదవ్ సైలెంట్ గా ఉంటున్నారు. ఇక నెల్లూరులో పలువురు వైసీపీ నాయకులు అనిల్ యాదవ్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నెల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనిల్ యాదవ్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, నుడా(Nuda) ఛైర్మన్ ద్వారకానాథ్ లను టార్గెట్ చేసి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ సమావేశంలో వైసీపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసారు.

అనిల్ కుమార్ యాదవ్ తాను పార్టీ మారుతాను అనే ఆరోపణలపై స్పందిస్తూ.. నా గుండె చప్పుడు జగన్. నా బ్లడ్ లో అణువణువు జగన్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదు. కొట్టినా కోసినా నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాను. ఉదయం నుంచి నాపై కొన్ని ఛానల్స్ రకరకాల వార్తలు ప్లే చేస్తున్నాయి. అవేమి జరగవు. ఈ మధ్య బాగా తిరిగా, 20 రోజులు విశ్రాంతి తీసుకున్నా అంతే. ఈ లోపే ఏవేవో ప్రచారం చేశారు. జగనన్న తప్ప జిల్లాలో నన్ను ఎవడూ మార్చలేడు. ఏడాది నుంచి కామ్ గా ఉంటే గుచ్చుతూనే ఉన్నారు. ఇక సైలెంట్ గా ఉండను. ఫైర్ బ్రాండ్ గానే ఉంటాను. 2024లో పోటీ చేసి గెలిచి చూపిస్తాను అని అన్నారు.

ఇక తనపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ.. సిటీ నియోజక వర్గంలోని ఇద్దరు వైసీపీ నాయకులు నా వెనుక గోతులు తవ్వుతున్నారు. వీరిద్దరూ బాహుబలి, భల్లాల దేవుడిలా ఫీలవుతున్నారు. ఓ రాజమాతను సిటీ నియోజకవర్గంలో పోటీ చేయించాలని తహతహలాడుతున్నారు. జగనన్న చెప్పినట్లు చేస్తామని చెబుతారు. రాత్రికి మందు తాగి కుట్ర చేస్తారు. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో నాకు సహాయo చేస్తారంటే నమ్మాలా. కొంతమంది నా వెనుక నుండి కొడుతూనే ఉన్నారు. నన్ను ఎదిరించే సత్తా ఉంటే నా ఎదురుగా వచ్చి ఢీ కొట్టాలి. చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అది నాకు జగన్ అన్న ఇచ్చిన అవకాశం. అనీల్ ఈ సారి ఎన్నికల్లో నువ్వు తప్పుకో అని జగన్ చెపితే సంతోషంగా తప్పుకుంటా. ఆనం రామనారాయణరెడ్డి జగన్ ను తిడుతుంటే జిల్లాలో కొందరు నాయకులు కామ్ గా ఉన్నారు. కానీ నేను అలా కామ్ గా ఉండను అని ఫైర్ అయ్యారు.

 

Also Read :  Posani Kishna Murali : పవన్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడటం ఏమిటి? ముద్ర‌గ‌డ ఎన్టీఆర్‌ హ‌యాంలోనే అలా చేశారు..

  Last Updated: 23 Jun 2023, 08:50 PM IST