Site icon HashtagU Telugu

Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్ ప్రసాద్..!

Neerabh Kumar Prasad

Neerabh Kumar Prasad

Neerabh Kumar Prasad: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియ‌మితుల‌య్యారు. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవ‌ల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా క‌లిసిన విష‌యం తెలిసిందే. నీరభ్ నియామకంపై జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. వైసీపీ హ‌యాంలో సీఎస్‌గా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సెలవుపై విదేశాల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే జ‌వ‌హ‌ర్ రెడ్డి సెలవు నుంచి తిరిగి రాగానే సీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. మ‌రోవైపు ఏపీలో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డంతో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుతో స‌హా మ‌రో 40 మంది స‌ల‌హాదారులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ టీడీపీ కూట‌మి భారీ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించింది. టీడీపీ కూట‌మిలో భాగ‌మైన టీడీపీ 135 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రోవైపు బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించింది. ఫ‌లితంగా టీడీపీ కూట‌మి 164 స్థానాల‌తో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. అయితే గ‌తంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

Also Read: USA Defeat Pakistan: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన అమెరికా.. అది కూడా సూప‌ర్ ఓవ‌ర్‌లో..!

అసెంబ్లీ స్పీకర్‌ ఎవరు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు నియమితులవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామ కృష్ణరాజు తనకు ఈ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే మొద‌ట్నుంచి స్పీక‌ర్ ప‌ద‌విని ర‌ఘురామ కృష్ణ‌రాజు అడుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

We’re now on WhatsApp : Click to Join