Site icon HashtagU Telugu

AP NDA Alliance : ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది – సీనియర్ యాక్టర్ నరేష్

Naresh Nda

Naresh Nda

ఏపీ ఎన్నికల ఫై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతున్నారు..? ఎవర్ని గద్దె దించబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ నేత ఎంత మెజార్టీ తో విజయం సాదించబోతున్నారు..? పిఠాపురం లో పవన్ గెలుస్తాడా..? ఇలా ఎన్నో రకాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారే కాదు సినీ , ఇతర పార్టీల రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో చిత్రసీమ ప్రముఖులు పెద్దగా నోరు విప్పకపోయినప్పటికీ..ఈసారి మాత్రం పెద్ద ఎత్తున కూటమికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా కూటమి కి మద్దతు తెలుపగా..తాజాగా సీనియర్ నటుడు, కృష్ణ ఫ్యామిలీ మెంబర్ నరేష్ సైతం కూటమి భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపించారు. నాకు పవన్ కల్యాణ్ అంటే యాక్టర్‌గా, పొలిటిషియన్‌గా నాకు అమితమైన గౌరవం. ఆయనను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుగా బీజేపీ జాతీయ కార్యదర్శి, యూత్ ప్రసిడెంట్‌గా చూస్తున్నాను. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సాధిస్తుందనే ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. అంతేకాకుండా ఈ విజయంతో ఏపీ ప్రతిష్ట, అభివృద్ది మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను.. జై శ్రీరాం అంటూ వీకే నరేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈయనే కాదు పరోక్షంగా కూడా చాలామంది సినీ ప్రముఖులు కూటమి కి మద్దతు తెలుపుతూ..వారి వారి పరిచయాలతో అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. ఇక అనేక సర్వేలు సైతం కూటమి విజయం సాదించబోతుందని చెపుతున్నాయి.

Read Also : AP Elections : ఏపీలో కూటమి జోరు..రోజుకు రోజుకు పెరుగుతున్న ప్రజా జోరు