ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పై జాతీయ మీడియా ప్రశంసలు (National Media) కురిపిస్తోంది. పదినెలల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో బాబు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. “ఇదీ ప్రభుత్వం అంటే” అనే శీర్షికలతో వెలువడిన విశ్లేషణలు, ప్రభుత్వ పనితీరుపై సానుకూల స్పందన వ్యక్తం చేశాయి. డిజిటల్ విప్లవం, ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో చంద్రబాబు తిరిగి తన మార్క్ చూపిస్తున్నారని మీడియా తెలిపింది.
New CM : అతి త్వరలో తెలంగాణ కు కొత్త సీఎం – బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు
1995లో మొదలైన చంద్రబాబు పాలనను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ప్రజలతో చేరువైన బాబు, ఇప్పుడు స్వయంగా ప్రజల మధ్యకి వెళ్లి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం నేరుగా ఫీల్డ్‌లో ఉండే నేతగా ఆయన మారిన విధానాన్ని మీడియా హర్షించింది. ముఖ్యంగా “విజన్” అనే పదం చంద్రబాబు పాలనకు ఓ అర్థవంతమైన గుర్తుగా మారిందని, అదే పునరావృతం కావడం ద్వారా రాష్ట్రానికి మేలుకలగనుందని విశ్లేషకుల అభిప్రాయం.
పీ4 విధానంతో పేదరిక నిర్మూలన లక్ష్యం
“వికసిత ఆంధ్రప్రదేశ్ 2047” అనే లక్ష్యాన్ని ముందుంచుకుని చంద్రబాబు రూపొందించిన పీ4 విధానం (People, Partnership, Productivity, Performance) పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే.. పేదల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. గతంలో మిత్రపక్షాలైన కమ్యూనిస్టులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలకు పూర్తి గౌరవం ఇస్తుండటం కూడా మీడియా ప్రత్యేకంగా పేర్కొంది. కేంద్రంతో సమన్వయంగా పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధి దిశగా మేధో యోచనలతో ముందుకెళ్తున్న నేతగా చంద్రబాబును కొనియాడుతున్నారు.
Tamil Nadu BJP President: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు.. ఎవరీ నైనార్ నాగేంద్రన్?