Site icon HashtagU Telugu

CBN : ‘చంద్రబాబు’ పేరును జపం చేస్తున్న నేషనల్ మీడియా

Chandrababu Swearing In Tim

Chandrababu swearing-in time finalized..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న..ఎవరు మాట్లాడుకున్న చెప్పేది..మాట్లాడేది..వినిపించేది రెండే పేర్లు ఏవ్ చంద్రబాబు..పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లు మీడియాలో , సోషల్ మీడియా లో మారుమోగిపోతున్నాయి. ఏపీలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ కు తెరపడినప్పటికీ..ఇంకా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ల కష్టం..చేసిన తాగ్యాల వల్లే ఈరోజు కూటమి ఇంత పెద్ద విజయం సాధించిందని అంటున్నారు. కూటమి గెలుస్తుందని భావించారు..కానీ 164 అసెంబ్లీ , 21 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు కూడా భావించలేదు. ఇంత పెద్ద విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే…వైసీపీ శ్రేణులు మాత్రం ఇది ఎలా జరిగిందనే బాధపడుతున్నారు. ఇక కేంద్రంలోని NDA కూటమి కి ఏపీ సపోర్ట్ చాల అవసరం కావడం తో అక్కడి మీడియా వారు చంద్రబాబు ను ఆకాశానికి ఎత్తేస్తూ కూటమి విజయం పట్ల తెగ కవర్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ‘ఇండియాటుడే’ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక సీఎంగా కాకుండా ‘సీఈవో’గా పేరు పొందారని ఆ కథనం కొనియాడింది. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన చంద్రబాబు పాలన 1990లలో ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా కార్పొరేట్ శైలిలో ఉండేదని పేర్కొంది. హైదరాబాద్‌ను నవభారతంలో సైబర్ హబ్‌గా మార్చేశారని వివరించింది. హైటెక్ సిటీ, ఐటీ, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వంటివాటితో సైబరాబాద్‌గా మార్చేశారని ప్రశంసించింది. హైటెక్ సిటీ హైటెక్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారిందని పేర్కొంది. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ రప్పించి దేశం మొత్తం ఇటు చూసేలా చేశారని గుర్తు చేసింది. ఇలా చంద్రబాబు విజన్ గురించి చెప్పుకొచ్చింది. ఇది చూసి తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడుతున్నారు.

Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో ఇది గమనించారా.. కమ్‌బ్యాక్ ఇన్ టెన్..