National Highway : ఏపీలో జెట్ స్పీడ్ గా నేషనల్ హైవే పనులు

National Highway : ఈ నూతన హైవే పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. అలాగే, ప్రయాణ సమయం 3 గంటల వరకు ఆదా అవుతుంది. ఈ హైవేపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది

Published By: HashtagU Telugu Desk
Ap National Highway

Ap National Highway

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. పాత ప్రాజెక్టులతో పాటుగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా, కేంద్రం భారతమాల పరియోజనలో భాగంగా విజయవాడ నుంచి బెంగళూరుకు నిర్మిస్తున్న ఆరు వరుసల నేషనల్ హైవే 544G ప్రాజెక్టులో ఒక ప్రత్యేకమైన నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నెల్లూరు, కడప జిల్లాల మధ్య అత్యంత పొడవైన సొరంగం నిర్మాణం చేపట్టారు. ఈ సొరంగం నెల్లూరు జిల్లాలోని సీతారామపురం వద్ద మొదలై, కడప జిల్లాలో బయటికి వస్తుంది. ఇది వాహనాల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Trump Tariffs India : భారత్ పై కావాలనే టారిఫ్స్ పెంచారు – వాన్స్

విజయవాడ-బెంగళూరు మధ్య నిర్మిస్తున్న ఈ 518 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి ఆరు వరుసలది కావడంతో, వాహనాలు వెళ్లడానికి, రావడానికి వేర్వేరు సొరంగాలు నిర్మిస్తున్నారు. ప్రతి సొరంగం 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో 3.68 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగం నిర్మాణం కోసం రూ.857.75 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పనులను మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీ చేపట్టింది. ఈ సొరంగం నిర్మాణ పనులు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి, 2027 ఫిబ్రవరి 6 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సొరంగాన్ని 15 ఏళ్లపాటు మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీనే నిర్వహించనుంది.

ఈ నూతన హైవే పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. అలాగే, ప్రయాణ సమయం 3 గంటల వరకు ఆదా అవుతుంది. ఈ హైవేపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. ఈ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి మొదలై, ప్రకాశం జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద NH 16లో కలుస్తుంది. ప్రస్తుతం హైవే పనులు కొన్ని ప్రాంతాలలో పూర్తయ్యాయి, మిగిలిన చోట్ల వేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 25 Aug 2025, 12:42 PM IST