3 Years of Yuva Galam Padayatra Nara Lokesh నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని నేతలు కొనియాడారు.
- ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందన్న నేతలు
- మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
- ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందన్న నేతలు
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు, ఆదిరెడ్డి వాసు, ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, వేపాడ, గ్రీష్మ, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు.
