Prajadarbar : నారా లోకేష్ చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కు విశేష స్పందన

విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిర్వహించిన “ప్రజాదర్బార్ లో వినతులు వెల్లువెత్తాయి.

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 01:58 PM IST

నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. మంగళగిరి ఎమ్మెల్యే , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి ప్రజల కోసం ‘ప్రజాదర్బార్’ (Praja Darbar) నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ గంటల్లోనే ఈ సంచలన నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఇక ఇప్పుడు గెలిచినా తర్వాత కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ అనే కార్య క్రమాన్ని చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని లోకేష్ కు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులు గా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇచ్చారు. అంగన్ వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న లోకేష్..సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామని భరోసా ఇవ్వడంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Chandrababu: పోలవరం పనులను పర్యవేక్షించిన చంద్రబాబు