Site icon HashtagU Telugu

Lokesh : నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

Nara Lokesh Yuvagalam Padayatra resumes

Nara Lokesh Yuvagalam Padayatra resumes

Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ(tdp) యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర రేపటి(మంగళవారం) నుండి పున:ప్రారంభంకానుంది. పాదయాత్రకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు లోకేష్‌ యాత్ర రేపు ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు మీదుగా జరిగే యాత్ర మే 6న ఏలూరులో ముగుస్తుంది. ఈ సందర్భంగానే ఈరోజు సాయంత్రం 4:00 నుంచి 6:00 వరకు యువతతో లోకేష్ ముచ్చటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.

Read Also: Title: దేవినేని ఉమాకు ఏమైంది? ఎక్కడున్నాడు..?

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మెనీఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్ పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్ ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా….తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 4వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.