Yuvagalam : నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభంకు స‌ర్వంసిద్ధం.. ఈ నెల 29 రాత్రి గం.8.15 ప్రారంభంకానున్న పాద‌యాత్ర‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌రువాత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర బ్రేక్ ప‌డింది. చంద్ర‌బాబును 14

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 10:09 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌రువాత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర బ్రేక్ ప‌డింది. చంద్ర‌బాబును 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయ‌న అరెస్ట్ త‌రువాత నుంచి నారా లోకేష్ యువ‌గ‌ళం క్యాంప్‌సైట్ నుంచి విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమండ్‌లో ఉండ‌టంతో ఆయ‌న కూడా రాజ‌మండ్రి చేరుకున్నారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేయ‌డంతో హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. అక్క‌డ కూడా చంద్ర‌బాబుకు చుక్కెదురు అయింది. దీంతో చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టులో దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో రేపు ఇది విచార‌ణ‌కు రానుంది. అయితే చంద్ర‌బాబు రిమాండ్‌ను కూడా ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు రిమాండ్ పొడిగిస్తూ న్యాయ‌మూర్తి ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఇటు నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి న్యాయ‌స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ప్ర‌భుత్వం త‌దుప‌రి పెట్టే కేసుల‌ను ఎలా ఎదుర్కొవాల‌ని ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీలో సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చిస్తున్నారు.

మ‌రోవైపు లోకేష్ యువ‌గ‌ళం ప్రారంభంకారుంది. ఈ నెల 8న రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో ఆగిన పాద‌యాత్ర‌ను ఈ నెల 29వ తేదీనుంచి తిరిగి ప్రారంభ‌కానుంది. 20 రోజుల తరువాత ప్రారంభంకానున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న వచ్చే అవ‌కాశం ఉంది. అయితే లోకేష్‌పై ఇప్ప‌టికే సీఐడీ కేసు న‌మోదు చేసింది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ని ఏ14గా చేరుస్తూ సీఐడీ మోమో దాఖ‌లు చేసింది.లోకేష్‌ని ఏ క్ష‌ణ‌మైన సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతంది. మ‌రోవైపు రాజ‌మండ్రి బ్రిడ్జికి మ‌ర‌మ్మ‌త్తుల పేరుతో మూసివేశారు.ఇవన్నీ లోకేష్ యువ‌గ‌ళం అడ్డుకోవ‌డానికే ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.